News October 24, 2024

పుష్ప-2 రిలీజ్‌పై అధికారిక ప్రకటన

image

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప-2’. ఈ సినిమా అధికారిక విడుదల తేదీని వెల్లడిస్తూ హీరో అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అంతకుముందు ఈ సినిమా డిసెంబర్ 6న విడుదల చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘పుష్ప’ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో సీక్వెల్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Similar News

News February 2, 2026

జేఈఈ మెయిన్ దరఖాస్తుకు FEB 25 వరకు గడువు

image

JEE మెయిన్ తుది విడత పరీక్షకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 25వ తేదీ వరకు ఎగ్జామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. దరఖాస్తు స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది. తుది విడత పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి 9వ తేదీల మధ్య జరగనున్నాయి. జేఈఈ తొలి విడత పరీక్షలు జనవరి 29తో ముగిశాయి. వీటి ఫలితాలను ఈ నెల 12వ తేదీలోపు వెల్లడించనున్నారు.

News February 2, 2026

కంది మొక్కలను వరి పొలం గట్లపై పెంచితే ఏమిటి లాభం?

image

AP: కృష్ణా, గోదావరి జిల్లాల్లో వరి సాగు చేస్తున్న పొలాల గట్లపై రైతులు కందిని సాగు చేస్తున్నారు. దీని వల్ల కంది పంట పొలం తయారీకి, పురుగు మందుల కోసం చేసే ఖర్చు ఉండదు. వరికి పెట్టే నీటినే కంది మొక్కలు పీల్చుకొని పెరుగుతాయి. వరి పూత దశలో ఆశించే పురుగులను కంది ఆకర్షించి ఎర పైరుగా పని చేస్తుంది. రైతులకు రెండు పంటల దిగుబడి వస్తుంది. ఇలా పండించే రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై కంది విత్తనాలను అందిస్తోంది.

News February 2, 2026

హైదరాబాద్‌లోని IIMRలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

<>HYD<<>>లోని ICAR-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్‌‌(IIMR)లో 7 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ( అగ్రికల్చర్ సైన్స్, లైఫ్ సైన్స్), PG(అగ్రికల్చర్ ఎకనామిక్స్/ABM/అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్& అల్లైడ్ సైన్స్/ అగ్రికల్చర్/ ఫుడ్ టెక్నాలజీ), BE, BTech అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. FEB 5, 11 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వెబ్‌సైట్: www.millets.res.in/