News February 8, 2025

OFFICIAL: బీజేపీకి 48, AAPకు 22 సీట్లు

image

ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగిరింది. ఈసీ అధికారిక లెక్కల ప్రకారం మొత్తం 70 స్థానాల్లో 48 చోట్ల బీజేపీ విజయం సాధించింది. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ పార్టీ 22 స్థానాలకే పరిమితమైంది. మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ వరుసగా మూడో సారి ఖాతా తెరవలేకపోయింది. ఈసీ లెక్కల ప్రకారం బీజేపీ 45.66%, ఆప్ 43.57%, కాంగ్రెస్ 6.34% ఓట్లు సాధించాయి.

Similar News

News December 3, 2025

భద్రాద్రి: నేటి నుంచే 3వ విడత నామినేషన్లు

image

గ్రామపంచాయతీ ఎన్నికల 3వ విడత నామినేషన్ల స్వీకరణ నేటి నుంచి ప్రారంభమైంది. 7 మండలాల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. మండలాల వారీగా సర్పంచ్, వార్డు మెంబర్ల వివరాలు
ఆళ్లపల్లి – 12, 90
గుండాల – 11, 96
జూలూరుపాడు – 24, 198
లక్ష్మీదేవిపల్లి – 31, 260
సుజాతనగర్ – 13, 110
టేకులపల్లి – 36, 312
ఇల్లందు- 29, 274
మొత్తం 156 సర్పంచ్, 1340 వార్డు మెంబర్లకు నామినేషన్లు స్వీకరిస్తారు.

News December 3, 2025

APPSC పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల

image

APPSC ఈ క్యాలెండర్ ఇయర్‌లో విడుదల చేసిన 21 ఉద్యోగ నోటిఫికేషన్లకు పరీక్ష తేదీలను <>ప్రకటించింది<<>>. రాతపరీక్షలు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరుగుతాయి. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ (పేపర్-1) పరీక్ష జనవరి 27, 31, ఫిబ్రవరి 9, 11, 12 తేదీల్లో, సంబంధిత సబ్జెక్టు పేపర్ల పరీక్షలు జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు నిర్వహించనున్నారు. విశాఖ, తూ.గో., NTR, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పరీక్షలు జరగనున్నాయి.

News December 3, 2025

టెన్త్ అర్హతతో 362 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

image

ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో 362 మల్టీ టాస్కింగ్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. టెన్త్ అర్హతగల అభ్యర్థులు ఈనెల 14వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్స్( టైర్ 1, టైర్ 2) ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.18,000-రూ.56,900 చెల్లిస్తారు. వెబ్‌సైట్: mha.gov.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.