News March 21, 2024

OFFICIAL: కెప్టెన్‌గా తప్పుకున్న ధోనీ

image

IPL: చెన్నై సూపర్ కింగ్స్ టీం కెప్టెన్సీ మార్పుపై CSK ఫ్రాంచైజీ అధికారిక ప్రకటన చేసింది. IPL-2024లో రుతురాజ్ సారథ్యం వహిస్తారని పేర్కొంది. ధోనీ తన కెప్టెన్సీ బాధ్యతలను గైక్వాడ్‌కు అందించారని తెలిపింది. కాగా, కొత్త పాత్రలో కనిపించబోతున్నానని కొన్ని రోజుల క్రితమే మహి పోస్ట్ చేశారు. మరి ఈ సీజన్‌లో ధోనీ పూర్తి స్థాయిలో బరిలోకి దిగుతారా లేదా ఇంపాక్ట్ ప్లేయర్‌గా వస్తారా అనేది తెలియాల్సి ఉంది.

Similar News

News September 9, 2025

కవిత TDPలోకి వస్తారా? లోకేశ్ ఏమన్నారంటే..

image

కల్వకుంట్ల కవిత టీడీపీలోకి వస్తారా? అనే ప్రశ్నకు నారా లోకేశ్ స్పందించారు. ‘కవితను టీడీపీలోకి తీసుకోవడం అంటే జగన్‌ను టీడీపీలో చేర్చుకోవడం లాంటిది’ అని వ్యాఖ్యానించారు. తాను KTRను వివిధ సందర్భాల్లో కలిశానని, అందులో తప్పేంటని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పోటీపై చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. NDA అభ్యర్థికి ఓటు ఎందుకు వేశారో జగన్‌ను అడగాలని మీడియా చిట్‌చాట్‌లో అన్నారు.

News September 9, 2025

సియాచిన్‌లో ప్రమాదం.. ముగ్గురు సైనికుల మృతి

image

లద్దాక్‌లోని సియాచిన్ సెక్టార్‌ బేస్ క్యాంపులో విషాదం జరిగింది. డ్యూటీలో ఉన్న మహర్ రెజిమెంట్‌కు చెందిన సైనికులు మంచులో కూరుకుపోయారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, రెస్క్యూ టీమ్స్ 5 గంటల పాటు కష్టపడి కెప్టెన్‌ను రక్షించాయి. ప్రాణాలు కోల్పోయిన సైనికులు గుజరాత్, యూపీ, ఝార్ఖండ్‌కు చెందిన వారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. సియాచిన్ సముద్రమట్టానికి 12వేల అడుగుల ఎత్తులో ఉంటుంది.

News September 9, 2025

నేపాల్ తదుపరి PM.. ట్రెండింగ్‌లో బాలేంద్ర షా!

image

ఓలీ <<17657494>>రాజీనామాతో<<>> నేపాల్‌ తదుపరి PM ఎవరన్న చర్చ మొదలైంది. కాఠ్‌మాండూ మేయర్ బాలేంద్ర షా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సివిల్ ఇంజినీర్, ర్యాపర్ అయిన షా 2022లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి మేయర్ అయ్యారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తూ SMలో యాక్టివ్‌గా ఉండే షాకు యువత మద్దతు ఉంది. ఆయన PMగా బాధ్యతలు చేపట్టాలని ఆన్‌లైన్ క్యాంపెయిన్ కూడా మొదలైంది. కాగా కేవలం కాఠ్‌మాండూలోనే 18 మంది ఆందోళనకారులు మరణించారు.