News January 2, 2025

OFFICIAL: ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్‌కు గెస్ట్‌గా పవన్ కళ్యాణ్

image

రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈనెల 4న ఏపీలోని రాజమండ్రిలో జరగనుంది. ఈ ఈవెంట్‌కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్‌గా హాజరుకానున్నట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈనెల 10న విడుదల కానుంది.

Similar News

News December 4, 2025

సర్వర్ మొరాయింపుతో కౌశలం స్కిల్ టెస్టుకు అడ్డంకి.!

image

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల వేదికగా నిర్వహిస్తున్న కౌశలం (కౌన్సిలింగ్) సర్వేకు సంబంధించిన ఆన్‌లైన్ స్కిల్ టెస్ట్ ప్రక్రియ సర్వర్ సమస్యల కారణంగా తీవ్ర అంతరాయానికి గురైంది. జిల్లాలోని పలు సచివాలయ కేంద్రాలలో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు పరీక్ష కోసం హాజరైన అభ్యర్థులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది.

News December 4, 2025

బాత్రూమ్‌లో ఎంతసేపు ఉంటున్నారు?

image

డీహైడ్రేషన్, సరైన ఆహారం తీసుకోకపోవడం, ఫైబర్ కొరత వల్ల మలబద్ధకం ఏర్పడుతుందని అందరూ అనుకుంటారు. టాయిలెట్‌ను ఆపుకోవడం, బాత్రూమ్‌లో ఎక్కువసేపు గడపడమూ మలబద్ధకానికి కారణమేనంటున్నారు గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు. ‘పెద్దపేగు, పురీషనాళం అనుసరించే లయను విస్మరిస్తే మలం గట్టిగా మారుతుంది. ఫోన్ చూస్తూ 10 ని.ల కంటే ఎక్కువసేపు బాత్రూమ్‌లో కూర్చోవడం వల్ల మల రక్త నాళాలపై ఒత్తిడి పెరుగుతుంది’ అని పేర్కొంటున్నారు.

News December 4, 2025

మలబద్ధకాన్ని నివారించాలంటే?

image

* టాయిలెట్ వచ్చినప్పుడు వెంటనే వెళ్లాలి. రోజూ ఒకే సమయాన్ని అనుసరించాలి.
* సాధ్యమైనంత వరకు ఇండియన్ టాయిలెట్లను ఉపయోగించండి. వాటిని వాడటంలో సమస్యలుంటే వెస్ట్రన్ టాయిలెట్ల ముందు పీఠను ఉపయోగించి మోకాళ్లను కాస్త పైకి ఉంచుకోవాలి. ఇది మల మార్గాన్ని సులభతరం చేస్తుంది.
* 5-10 ని.ల కంటే ఎక్కువ సేపు బాత్రూమ్‌లో ఉండొద్దు.
* ఫుడ్‌లో తగినంత ఫైబర్, సరిపడినన్ని నీళ్లు తీసుకోవాలి. తేలికపాటి వ్యాయామాలు చేయాలి.