News September 1, 2024
OFFICIAL: తెలుగు రాష్ట్రాల్లో రేపు స్కూళ్లకు సెలవు

కుండపోత వర్షాలు, వరదలకు తెలుగు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో ముందు జాగ్రత్తగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు స్కూళ్లకు సెలవు ప్రకటించాయి. తొలుత ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవు ఇవ్వగా, తాజాగా సీఎంలు చంద్రబాబు, రేవంత్ అధికారికంగా ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News November 6, 2025
225 ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

TGలో జిల్లా కోఆపరేటివ్ బ్యాంకుల్లో(DCCB) 225 స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. డిగ్రీ పాసై, 18- 30ఏళ్ల వయసు గలవారు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. HYD, కరీంనగర్, ఖమ్మం, MBNR, మెదక్, WGL జిల్లాల్లో ఖాళీలున్నాయి. ఆన్లైన్ ఎగ్జామ్, సర్టిఫికెట్ల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. మరిన్ని ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి
News November 6, 2025
యుగయుగాలకు ఆదర్శం ‘శ్రీరాముడి పాలన’

సత్య యుగంలో అంతా మంచే ఉన్నా, త్రేతా యుగంలోని రామ రాజ్యమే చరిత్రలో నిలిచింది. దీనికి కారణం శ్రీరాముని గొప్ప గుణాలు, ఆదర్శవంతమైన పాలన అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన చూపిన రాజధర్మం సుపరిపాలనకు చిరునామాగా నిలిచింది. ఒక గొప్ప వ్యక్తి రాజుగా ఉంటే, రాజ్యం ఎంతటి ఉన్నత శిఖరాలను చేరుతుందో రామరాజ్యం రుజువు చేసింది. అందుకే, యుగాల తరబడి ఆ పాలనను ఆదర్శంగా చెప్పుకుంటారు. ‘రామరాజ్యం’ అని పోల్చుతుంటారు.
News November 6, 2025
ఈ పంటలకు నారు పెంచి ప్రధాన పొలంలో నాటుకోవాలి

తీగజాతి కూరగాయలు అయినటువంటి చిక్కుడు, ఫ్రెంచ్ చిక్కుడు, బెండ, గోరు చిక్కుడు, మునగ లాంటి కూరగాయ పంటలలో విత్తన పరిమాణం పెద్దదిగా ఉంటుంది. కాబట్టి వీటిని నారుగా కాకుండా విత్తనాలను నేరుగా పొలంలోనే విత్తుకోవచ్చు. టమాట, వంగ, క్యాబేజి, కాలిఫ్లవర్, మిరప, ఉల్లి లాంటి పంటలలో విత్తన పరిమాణం చాలా చిన్నగా ఉంటుంది. అందుకే వీటిని ముందుగా నారుమడులలో పెంచుకొని ఆ తర్వాత ప్రధాన పొలంలో నారును నాటుకోవాల్సి ఉంటుంది.


