News September 28, 2024

OFFICIAL: ‘దేవర’ తొలిరోజు కలెక్షన్లు ఎంతంటే?

image

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ సినిమా తొలి రోజు కలెక్షన్లను మేకర్స్ ప్రకటించారు. నిన్న ఒక్కరోజే సినిమాకు రూ.172 కోట్లు వచ్చినట్లు తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దీంతో ఫస్ట్ డే అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండో సినిమాగా రికార్డు సృష్టించింది. కాగా, ప్రభాస్ నటించిన ‘కల్కి’ సినిమా రిలీజైన రోజు రూ.191 కోట్లు రాబట్టింది.

Similar News

News December 15, 2025

సర్పంచ్ రిజల్ట్స్.. ‘టాస్‌’తో గెలిచారు

image

TG: రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో పలు చోట్ల అభ్యర్థులకు ఓట్లు సమానంగా వచ్చాయి. నల్గొండలోని మంగాపురంలో ఉపేంద్రమ్మకు, మౌనికకు సమానంగా ఓట్లు రాగా టాస్ వేయడంతో ఉపేంద్రమ్మకు పదవి వరించింది. కామారెడ్డిలోని ఎల్లారెడ్డిలో సంతోశ్, మానయ్యకు 483 ఓట్ల చొప్పున పోల్ అవ్వగా టాస్ వేసిన అధికారులు సంతోశ్‌ను విజేతగా ప్రకటించారు. మరికొన్ని చోట్ల ఓట్లు సమానంగా రావడంతో అధికారులు డ్రా తీసి విజేతలను నిర్ణయించారు.

News December 15, 2025

నేడు సర్వ ఏకాదశి.. మోక్షం కోసం ఏం చేయాలంటే?

image

మార్గశిర కృష్ణ పక్ష ఏకాదశినే సర్వ ఏకాదశి అంటారు. ఈ రోజున విష్ణువును ఆరాధించాలని పండితులు సూచిస్తున్నారు. తద్వారా మోక్షం లభిస్తుందని చెబుతున్నారు. ‘దానాలు చేయడం వల్ల ఆత్మ శుద్ధి జరుగుతుంది. చేసే పనుల పట్ల ఏకాగ్రత పెరుగుతుంది. తృణధాన్యాలు తీసుకోకుండా ఉపవాసం పాటించాలి. విష్ణు సహస్రనామం పఠించాలి. వ్రతాలు ఆచరించడం మరింత శ్రేయస్కరం. మనస్ఫూర్తితో విష్ణుమూర్తిని ఆరాధిస్తే ముక్తి లభిస్తుంది’ అంటున్నారు.

News December 15, 2025

రెండో విడతలోనూ కాంగ్రెస్‌దే హవా

image

TG: రెండో విడత GP ఎన్నికల్లోనూ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులదే హవా కొనసాగింది. మొత్తం 4,331 స్థానాల్లో ఏకగ్రీవాలతో కలుపుకొని 2,300కు పైగా స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థులు 1,100+, బీజేపీ 250+, ఇతరులు 480+ స్థానాల్లో గెలుపొందారు. మొత్తం 46.7 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోగా అత్యధికంగా భువనగిరి(91.2%), అత్యల్పంగా నిజామాబాద్(76.71%)లో పోలింగ్ నమోదైంది.