News October 7, 2025

అధికారికంగా కొమురం భీం వర్ధంతి.. ఇవాళ స్కూళ్లకు సెలవు

image

TG: గిరిజనుల ఆరాధ్యుడు కొమురం భీం వర్ధంతిని ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన 85వ వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆసిఫాబాద్‌లో NOV 8, ఆదిలాబాద్‌లో DEC 13న(రెండో శనివారాలు) స్కూళ్లు పనిచేస్తాయని తెలిపారు.

Similar News

News October 7, 2025

IPOకు లలితా జ్యువెలరీ

image

రూ.1700 కోట్ల సమీకరణ లక్ష్యంగా లలితా జ్యువెలరీ మార్ట్ PVT Ltd త్వరలో IPOకు రానుంది. ఇందులో ఫ్రెష్ ఈక్విటీ షేర్లతో రూ.1200 కోట్లు, ప్రమోటర్ కిరణ్ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.500 కోట్ల విలువైన షేర్స్ సెల్ చేయనుంది. పబ్లిక్ ఇష్యూ కోసం జూన్‌లోనే సెబీకి అప్లై చేయగా ఇటీవల గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ చెన్నై బేస్డ్ కంపెనీకి తమిళనాడులో 2 మాన్యూఫ్యాక్చర్ యూనిట్స్, సౌత్ సహా దేశంలో 56 బ్రాంచిలు ఉన్నాయి.

News October 7, 2025

నేషనల్ హౌసింగ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు

image

నేషనల్ హౌసింగ్ బ్యాంక్‌ 6 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈనెల 21వరకు అప్లై చేసుకోవచ్చు. జనరల్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టులు ఉన్నాయి పోస్టును బట్టి CA, MBA, PGDM, PGDBM, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అర్హులు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. దరఖాస్తు ఫీజు రూ.850, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.175. వెబ్‌సైట్: https://www.nhb.org.in/

News October 7, 2025

DGEMEలో 194 పోస్టులు

image

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్(DGEME)194 గ్రూప్ సీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ఇంటర్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు ఈ నెల 24వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: indianarmy.nic.in