News August 8, 2025

అధికారికంగా ప్రగడ కోటయ్య జయంతి: చంద్రబాబు

image

AP: చేనేత సూరీడు ప్రగడ కోటయ్య జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. మంగళగిరిలో నిర్మించే పార్కుకు ఆయన పేరు పెట్టి, అక్కడ విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. రూ.74 కోట్లతో వెంకటగిరి, మంగళగిరి, ఉప్పాడ, రాజాం, శ్రీకాళహస్తిలో చేనేత క్లస్టర్లను ఏర్పాటు చేసి, చేనేతలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. చేనేతల అభివృద్ధి కోసం పారిశ్రామికవేత్త సుచిత్ర ఎల్లను సలహాదారుగా నియమించామన్నారు.

Similar News

News August 8, 2025

IPL: RRతో సంజూ కటీఫ్!

image

రాజస్థాన్ రాయల్స్ నుంచి సంజూ శాంసన్ తప్పుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. జూన్‌లోనే సంజూ ఈ విషయాన్ని <<17327950>>యాజమాన్యానికి<<>> చెప్పారని, కానీ వారు ఒప్పుకోలేదని ESPNcricinfo తెలిపింది. దీంతో ఈ వ్యవహారాన్ని కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది. ఆయన ఒప్పుకుంటే సంజూను రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత సంజూను మరో ఫ్రాంచైజీ ఆటగాడితో ట్రేడ్ చేసుకుంటారు. అది సాధ్యం కాకపోతే సంజూ 2026లో వేలంలోకి వెళ్లనున్నారు.

News August 8, 2025

సుంకాల నుంచి ఫార్మాకు మినహాయింపు.. ఎందుకంటే?

image

అమెరికాలో వాడే జనరిక్ మెడిసిన్లలో 40% మందులు భారత్ నుంచి ఎగుమతి అవుతాయి. క్యాన్సర్, ఇతర ప్రమాదక వ్యాధులకు మన దేశ మందులనే వాడుతారు. అయితే ట్రంప్ సర్కార్ టారిఫ్స్ నుంచి ఫార్మా ఉత్పత్తులకు మినహాయింపు ఇచ్చింది. మెడిసిన్ ధరలు భారీగా పెరిగితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కొన్ని భారత ఫార్మా కంపెనీలు USలోనే ఉత్పత్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నాయి.

News August 8, 2025

రేప్ కేసులో పాక్ క్రికెటర్ అరెస్టు.. బెయిల్‌పై విడుదల

image

రేప్ కేసులో పాకిస్థాన్-A క్రికెటర్ హైదర్ అలీని ఇంగ్లండ్ మాంచెస్టర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంగ్లండ్-Aతో వన్డేలు ఆడేందుకు UK వచ్చినప్పుడు అతడు తనపై అత్యాచారం చేశాడని పాకిస్థాన్‌కు చెందిన యువతి ఫిర్యాదు చేసింది. AUG 3న అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు పాస్‌పోర్ట్ స్వాధీనం చేసుకుని అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు. అటు విచారణ పూర్తయ్యే వరకు అలీని సస్పెండ్ చేస్తున్నట్లు పాక్ క్రికెట్ బోర్డు తెలిపింది.