News March 12, 2025
దళితులకు ఆలయ ప్రవేశం కల్పించిన అధికారులు

పశ్చిమ బెంగాల్‌లోని ఓ గ్రామంలో ఆలయ ప్రవేశం కోసం దళితులు చేస్తున్న పోరాటానికి ఫలితం లభించింది. గిధగ్రాంలో ఐదుగురు దళితులను పోలీసులు ప్రత్యేక భద్రతతో శివాలయంలోకి తీసుకెళ్లారు. అనంతరం వారితో ప్రత్యేక పూజలు జరిపించారు. గ్రామంలో దాదాపు 6 శాతమున్న తమకు కులవివక్ష పేరుతో ఇన్నేళ్లుగా ఆలయ ప్రవేశం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లా అధికారులకు లేఖ రాయడంతో తమకు న్యాయం జరిపించారని సంతోషం వ్యక్తం చేశారు.
Similar News
News January 9, 2026
‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపుపై HCలో పిటిషన్

TG: ప్రభాస్ ‘రాజాసాబ్’ టికెట్ ధరల <<18804706>>పెంపును<<>> సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది శ్రీనివాస్ దీన్ని సింగిల్ బెంచ్ జడ్జి వద్ద మెన్షన్ చేశారు. అర్ధరాత్రి టికెట్ ధరలు పెంచుతూ ప్రభుత్వం మెమో ఇచ్చిందని పేర్కొన్నారు. పిటిషన్‌పై కాసేపట్లో విచారణ జరగనుంది. కాగా నిన్న టికెట్ రేట్లు పెంచకపోవడంతో మేకర్స్ ప్రీమియర్స్ రద్దు చేశారు. చివరికి అర్ధరాత్రి ప్రభుత్వం జీవో జారీ చేసింది.
News January 9, 2026
అందరికీ అండగా ఉండే అచ్యుతుడు

సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృగ్విశ్వభుగ్విభుః ।
సత్కర్తా సత్కృతః సాధుర్జహ్నుర్నారాయణో నరః ॥
దేవుడు దయామయుడు. భక్తులపై అనుగ్రహం చూపుతూ కోరిన వరాలిస్తాడు. విశ్వాన్ని రక్షిస్తాడు. సత్కర్మలు చేసేవారిని గౌరవిస్తూ, సాధువులకు అండగా ఉంటాడు. తనను నమ్మిన వారిని చేయి పట్టి నడిపిస్తూ, పరమపదానికి చేరుస్తాడు. సర్వవ్యాపియైన ఆ నారాయణుడు ప్రతి జీవిలోనూ ఉండి, మనల్ని సన్మార్గంలో నడిపిస్తాడు. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>
News January 9, 2026
గార్డెన్ రిచ్ షిప్‌బిల్డర్స్& ఇంజినీర్స్ లిమిటెడ్‌లో 220 పోస్టులు

గార్డెన్ రిచ్ షిప్‌బిల్డర్స్& ఇంజినీర్స్ లిమిటెడ్‌లో 220 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఐటీఐ, గ్రాడ్యుయేట్(Engg.), డిప్లొమా ఉత్తీర్ణులు NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 26ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. విద్యార్హతల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.grse.nic.in/


