News January 3, 2025

అధికారులు సీరియస్‌గా అర్జీలు పరిష్కరించాలి: అనగాని

image

APలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో అర్జీల పరిష్కారంపై ప్రజలు సంతృప్తిగా లేరని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. మంగళగిరి CCLA ఆఫీసులో రెవెన్యూ శాఖపై ఆయన సమీక్షించారు. 2016లో అసెంబ్లీలో తాను ప్రస్తావించిన 22A సమస్యకే ఇంకా పరిష్కారం చూపలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై CM కూడా సీరియస్‌గా ఉన్నారని, ప్రజలు ఎంతమేరకు సంతృప్తిగా ఉన్నారనే విషయంపై అధికారులు ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని సూచించారు.

Similar News

News January 5, 2025

త్రివిక్రమ్‌పై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు: పూనమ్ కౌర్

image

డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై హీరోయిన్ పూనమ్ కౌర్ మరోసారి విమర్శలు గుప్పించారు. ‘త్రివిక్రమ్‌పై చాలాకాలం కిందట MAAలో ఫిర్యాదుచేశా. అయినా అతడిని ప్రశ్నించలేదు.. చర్యలు తీసుకోలేదు. నా ఆరోగ్యం, సంతోషాన్ని నాశనం చేసిన అతడిని పెద్ద తలకాయలు కాపాడుతున్నాయి’ అని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. త్రివిక్రమ్ తనతోపాటు ఎంతో మంది జీవితాలను నాశనం చేశాడని ఆమె పలుమార్లు ఆరోపించిన విషయం తెలిసిందే.

News January 5, 2025

వందల ఏళ్ల సంప్రదాయం.. ఆదివారం ఆ ఊరిలో మాంసం తినరు

image

AP: ఆదివారం వచ్చిందంటే చాలా ఇళ్లలో మాంసాహారం తప్పనిసరి. కానీ నంద్యాల(D) ఎస్.కొత్తూరులో మాత్రం వందల ఏళ్లుగా సండే ఎవరూ మాంసం తినరు. మద్యం తాగరు. గ్రామంలో ఎవరైనా ఆదివారం మరణించినా అంత్యక్రియలు మరుసటి రోజు నిర్వహిస్తారు. 400 ఏళ్ల కిందట ఓ పొలంలో దొరికిన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహంతో ఆలయం నిర్మించారని, ఆ స్వామికి ఆదివారం ప్రీతికరమైన రోజని గ్రామస్థుల భావన. అందుకే భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నారు.

News January 5, 2025

BGT2024-25: టాప్-10 ఆటగాళ్లు వీరే

image

BGTలో బ్యాటింగ్‌లో హెడ్(448 రన్స్), బౌలింగ్‌లో బుమ్రా(32 వికెట్లు) అగ్రస్థానంలో నిలిచారు. హెడ్ తర్వాత జైస్వాల్(391), స్మిత్(314), నితీశ్(298), రాహుల్(276), పంత్(255), లబుషేన్(232), క్యారీ(216), కోహ్లీ(190), ఖవాజా(184) ఉన్నారు. ఇక బౌలింగ్‌లో బుమ్రా తర్వాత వరుసగా కమిన్స్(25), బోలాండ్(21), సిరాజ్(20), స్టార్క్(18), లయన్(9), హేజిల్‌వుడ్(6), ప్రసిద్ధ్(6), నితీశ్(5), ఆకాశ్ దీప్(5) ఉన్నారు.