News January 4, 2025
నాగార్జున సాగర్ డ్యామ్‌ను సందర్శించిన అధికారులు

నాగార్జున సాగర్ ప్రాజెక్టును సీడబ్ల్యూసీ (సెంట్రల్ వాటర్ కమిషన్), కేఆర్ఎంబీ (కృష్ణా రివర్ బోర్డు మేనేజ్‌మెంట్) అధికారులు సందర్శించారు. ప్రాజెక్టులోని నీటిని ఏపీ అధిక శాతంలో వాడుకుంటోందని తెలంగాణ ఫిర్యాదు చేసింది. దీంతో అధికారులు అక్కడి పరిస్థితులను పరిశీలించారు. అలాగే అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను కూడా వారు పర్యవేక్షించారు.
Similar News
News November 24, 2025
చీకటి తర్వాత రావి చెట్టు వద్దకు వెళ్లకూడదా?

చీకటి పడ్డాక రావి చెట్టు వద్దకు వెళ్తే దెయ్యాలు, దుష్ట శక్తులు సంచరిస్తాయని పెద్దలు అంటుంటారు. కానీ ఇదొక అపోహ మాత్రమే. దీని వెనుక వృక్షశాస్త్ర రహస్యం ఉంది. రాత్రిపూట రావి చెట్టు పెద్ద మొత్తంలో చెడు గాలిని విడుదల చేస్తుంది. దానిని పీల్చడం ప్రమాదకరం. కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా కావచ్చు. దీని గురించి శాస్త్రీయంగా వివరించలేక దెయ్యాల పేర్లు చెప్పేవారు. అలా జనాలను ఈ చెట్టు వద్దకు వెళ్లకుండా చేసేవారు.
News November 24, 2025
‘తేజస్’ ప్రమాదంపై స్పందించిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్

దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ జెట్ <<18349994>>కూలిపోయిన<<>> ఘటనపై తయారీ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) స్పందించింది. ఇది అసాధారణ పరిస్థితుల వల్ల జరిగిన ఘటన అని ఓ ప్రకటనలో పేర్కొంది. ‘ఈ ప్రమాదాన్ని విమానం పనితీరుకు ప్రతిబింబంగా చూడకూడదు. ఇది మా వ్యాపార కార్యకలాపాలు, భవిష్యత్తు డెలివరీలపై ఎలాంటి ప్రభావం చూపబోదు. దర్యాప్తుకు సహకరిస్తున్నాం’ అని తెలిపింది.
News November 24, 2025
BELOPలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

BEL ఆప్ట్రోనిక్ డివైసెస్ లిమిటెడ్(<


