News December 18, 2025

OG కోసం సొంత కారు అమ్మిన డైరెక్టర్!

image

డైరెక్టర్ సుజీత్‌కు హీరో పవన్ కళ్యాణ్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును గిఫ్ట్ ఇచ్చిన <<18579913>>విషయం<<>> తెలిసిందే. ఆ కారును పవన్ గిఫ్ట్‌గా ఎందుకిచ్చారో సినీవర్గాలు తెలిపాయి. ‘OGలోని కొన్ని సీన్లు జపాన్‌లో షూట్ చేద్దామనుకుంటే బడ్జెట్ వల్ల నిర్మాత ఒప్పుకోలేదు. ఈ సీన్ ప్రాధాన్యం దృష్ట్యా సుజీత్ తన కారు అమ్మేసి షూట్ పూర్తిచేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పవన్.. అదే మోడల్ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు’ అని పేర్కొన్నాయి.

Similar News

News December 20, 2025

అడిషనల్ కలెక్టర్ల లంచాల దందా..! సీఎం సీరియస్

image

TG: భూభారతి సమస్యలు తీర్చేందుకు జిల్లాల్లో అడిషనల్ కలెక్టర్లు లంచాలు తీసుకుంటున్నారంటూ సీఎంవోకు ఫిర్యాదులు వస్తున్నాయి. అన్నీ సక్రమంగా ఉన్నా ఫైల్‌పై సంతకం పెట్టాలంటే లంచం డిమాండ్ చేస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు. దీంతో ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. రైతులను ఇబ్బంది పెడుతున్న అధికారులను ఉపేక్షించేది లేదని హెచ్చరించినట్లు సమాచారం. ఫైళ్ల పెండింగ్‌పై సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు.

News December 20, 2025

పేరెంట్స్ మర్చిపోవద్దు.. రేపే పల్స్ పోలియో!

image

AP: రాష్ట్ర వ్యాప్తంగా రేపు పల్స్ పోలియో నిర్వహించనున్నారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలను తప్పక వేయించాలని ఇప్పటికే మంత్రి సత్యకుమార్ సూచించారు. రాష్ట్రంలోని 54,07,663 మంది చిన్నారులకు 38,267 బూత్‌లు ఏర్పాటు చేశారు. 61,26,120 డోస్‌లను జిల్లాలకు సరఫరా చేశారు. ఏదైనా కారణంతో రేపు పోలియో చుక్కలు వేయించుకోలేకపోయిన చిన్నారులకు 22, 23 తేదీల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి అందించనున్నారు.

News December 20, 2025

ఎద్దు అడుగులో ఏడు గింజలు పడితే పంట పలచన

image

నాగలితో దున్నుతూ విత్తనాలు వేసేటప్పుడు, ఎద్దు వేసే ఒక అడుగు దూరంలో ఏడు గింజలు పడ్డాయంటే అవి చాలా దగ్గర దగ్గరగా పడ్డాయని అర్థం. ఇలా విత్తనాలు మరీ దగ్గరగా మొలిస్తే మొక్కలకు గాలి, వెలుతురు సరిగా అందవు. నేలలోని పోషకాల కోసం మొక్కల మధ్య పోటీ పెరిగి ఏ మొక్కా బలంగా పెరగదు. ఫలితంగా పంట దిగుబడి తగ్గి పలచగా కనిపిస్తుంది. అందుకే పంట ఆశించిన రీతిలో పండాలంటే విత్తనాల మధ్య తగినంత దూరం ఉండాలని ఈ సామెత చెబుతుంది.