News September 24, 2025
OG మూవీకి హైకోర్టులో ఎదురుదెబ్బ

TG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-సుజీత్ కాంబోలో తెరకెక్కిన OG చిత్రానికి తెలంగాణలో ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమా బెనిఫిట్ షో, టికెట్ రేట్లు పెంచుతూ జారీ చేసిన మెమోను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ జీవోపై కొందరు హైకోర్టును ఆశ్రయించగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇవాళ రాత్రి 10 గం.కు ప్రదర్శించాల్సిన ప్రీమియర్స్, ఇప్పటికే కొనుగోలు చేసిన టికెట్లపై సందిగ్ధం నెలకొంది.
Similar News
News January 21, 2026
జగన్ పాదయాత్ర కామెంట్లపై పార్థసారథి కౌంటర్

AP: పాదయాత్ర చేస్తానని వైసీపీ చీఫ్ జగన్ ప్రకటించిన నేపథ్యంలో మంత్రి పార్థసారథి కౌంటర్ ఇచ్చారు. ‘జగన్ ఒకసారి పాదయాత్ర చేస్తే ఏపీ ఎంతో నష్టపోయింది. మరోసారి చేయడం వలన రాష్ట్రం ఏమైపోతుందో. ప్రజలను ఒకసారి మోసం చేయొచ్చు.. మళ్లీ మళ్లీ మోసం చేయడం అసాధ్యం’ అని ఆయన విమర్శించారు. కాగా ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేస్తానని <<18916311>>జగన్<<>> ఇవాళ ప్రకటించిన విషయం తెలిసిందే.
News January 21, 2026
లైఫ్ ఇన్సూరెన్స్: ప్రీమియం చెల్లింపులో జాప్యం చేస్తే..?

టర్మ్ ఇన్సూరెన్స్ నెలవారీ ప్రీమియానికి 15రోజులు, మూడు, ఆరు నెలల ప్రీమియం చెల్లించేందుకు 30రోజుల సమయం ఇస్తారు. అప్పటికీ ప్రీమియం కట్టకపోతే ఇన్సూరెన్స్ ల్యాప్స్ అవుతుందని గో డిజిట్ లైఫ్ ఇన్సూరెన్స్ MD సబ్యసాచి తెలిపారు. ‘దీంతో క్లయింట్లు కవరేజీ కోల్పోతారు. కొన్ని కంపెనీలు మాత్రమే ఇన్సూరెన్స్‌ను పునరుద్ధరిస్తాయి. అందుకు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తంతో పాటు వడ్డీని వసూలు చేస్తాయి’ అని వివరించారు.
News January 21, 2026
‘మూసీ పునరుజ్జీవనం’లో ‘టాటా’ భాగస్వామ్యం

TG: దావోస్‌లో టాటా ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. విజన్–2047 లక్ష్యాలు, రాష్ట్రంలోని పెట్టుబడుల అనుకూల విధానాలను వివరించారు. HYDలోని స్టేడియాల అభివృద్ధికి సహకరించాలని కోరగా టాటా ఛైర్మన్ సంసిద్దత తెలిపారు. మూసీ నది పునరుజ్జీవనంలో భాగస్వామ్యమయ్యేందుకు ఆసక్తి వ్యక్తపరిచారు. హోటళ్లు, రిసార్ట్స్, మాన్యుఫాక్చరింగ్ యూనిట్ల ఏర్పాటు చేసేందుకు CM చంద్రశేఖరన్ చర్చించారు.


