News August 24, 2025
OG అప్డేట్.. సెకండ్ సింగిల్ ఎప్పుడంటే?

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, ప్రియాంక కాంబోలో సుజీత్ తెరకెక్కిస్తున్న OG మూవీపై మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. వినాయక చవితి కానుకగా ఈనెల 27న 10.08AMకు సెకండ్ సింగిల్ రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ‘సువ్వీ సువ్వీ’ అంటూ సాగే సాంగ్ మిమ్మల్ని గెలుస్తుంది అంటూ స్పెషల్ పోస్టర్ షేర్ చేశారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ సింగిల్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం SEP 25న విడుదల కానుంది.
Similar News
News January 23, 2026
వింతల ప్రపంచం.. గ్రీన్‌లాండ్ ప్రత్యేకతలివే

ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపమైన గ్రీన్‌లాండ్‌లో 80% ప్రాంతం మంచుతోనే నిండి ఉంటుంది. కేవలం 56,000 జనాభా కలిగిన ఈ దేశంలో ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లడానికి రోడ్లు ఉండవు. పడవలే ప్రయాణ సాధనం. ఇక్కడి గాలి, నీరు ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైనవి. చెట్లు దాదాపుగా లేని ఈ గడ్డపై ప్రజలు మనుగడకు వేట, ఫిషింగ్‌పైనే ఆధారపడతారు. డెన్మార్క్, ఐస్‌లాండ్ నుంచి మాత్రమే చేరుకోగల ఈ దేశంలో అర్ధరాత్రి సూర్యుణ్ని చూడొచ్చు.
News January 23, 2026
జీ రామ్ జీ చట్టానికి వ్యతిరేకంగా TN అసెంబ్లీలో తీర్మానం

జీ రామ్ జీ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేసిన రాష్ట్రాల జాబితాలో తమిళనాడు చేరింది. ఆ రాష్ట్ర అసెంబ్లీలో సీఎం స్టాలిన్ తీర్మానం ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదించారు. ఉపాధి హామీ చట్టానికి మహాత్మాగాంధీ పేరు తీసేసి జీ రామ్ జీగా మార్చడాన్ని DMK వ్యతిరేకిస్తూ వస్తోంది. తాజాగా అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఇప్పటికే పంజాబ్, TG ప్రభుత్వాలు ఈ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేసిన విషయం తెలిసిందే.
News January 23, 2026
ఇద్దరు హంతకులు.. జైలులో ప్రేమ.. పెరోల్‌తో పెళ్లి!

ఇద్దరు హంతకుల మధ్య జైలులో చిగురించిన ప్రేమ పెరోల్‌తో పెళ్లి పీటలెక్కింది. డేటింగ్ యాప్‌లో పరిచయమైన యువకుడి హత్య కేసులో ప్రియా సేథ్ జీవిత ఖైదు అనుభవిస్తోంది. ప్రియురాలి భర్త, ఆమె ముగ్గురు పిల్లలు, మరో వ్యక్తిని చంపిన కేసులో హనుమాన్ ప్రసాద్ జైలులో ఉన్నాడు. ప్రియ, ప్రసాద్ మధ్య సంగనేర్(RJ) ఓపెన్ జైలులో ప్రేమ చిగురించింది. వీరికి 15రోజుల అత్యవసర పెరోల్‌ను RJ హైకోర్టు మంజూరు చేసింది. నేడు వీరి వివాహం.


