News December 29, 2024

అమ్మో.. ధరలు బాబోయ్ ధరలు!

image

TG: ఆదాయంలో మార్పు లేదు కానీ ఖర్చులు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. పప్పు నుంచి ఉప్పు వరకు, కూరగాయల నుంచి మాంసం వరకు అన్నీ భారమే. రాష్ట్రంలో కుటుంబాలకు నెలవారీ ఖర్చులు తలకు మించిన భారంగా ఉంటోందని జాతీయ గృహ వినియోగ సర్వే తెలిపింది. ప్రతి నెలా నిత్యావసరాల నిమిత్తం రాష్ట్రంలోని కుటుంబాలకు రూ.5675 ఖర్చవుతోందని పేర్కొంది. నెలవారీ వ్యయంలో కేరళ, తమిళనాడు తర్వాతి స్థానంలో తెలంగాణ నిలిచింది.

Similar News

News December 31, 2024

అవును సల్మాన్‌తో నా పెళ్లి ఆగిపోయింది: హీరోయిన్

image

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు నటి సంగీత బిజిలానీకి పెళ్లంటూ ఒకప్పుడు బీ టౌన్‌లో బాగా ప్రచారం జరిగింది. అది నిజమేనని సంగీత ఓ ఇంటర్వ్యూలో తాజాగా అంగీకరించారు. తన పెళ్లి పత్రికల్ని పంచేవరకూ వచ్చి ఆగిపోయిందని సల్మాన్ కూడా గతంలో వెల్లడించారు. అయితే సంగీత పేరును ఆయన చెప్పలేదు. కాగా.. బాలీవుడ్‌లో సల్లూభాయ్‌ పలువురితో ప్రేమాయణం నడిపినా ఏదీ పెళ్లి పీటల వరకూ రాలేదని అక్కడి వారు అంటుంటారు.

News December 31, 2024

తెలంగాణ సిఫార్సు లేఖలపై చంద్రబాబు కీలక నిర్ణయం

image

AP: తిరుమలకు తెలంగాణ నేతల నుంచి వచ్చే సిఫార్సు లేఖల్ని ఆమోదించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈమేరకు ఆయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. చంద్రబాబు నిర్ణయానికి రేవంత్ కృతజ్ఞతలు తెలిపారు. MLA/MLC/MP నుంచి సోమవారం నుంచి గురువారం మధ్యలో ఏవైనా 2 రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనానికి 2 లేఖలు, స్పెషల్ ఎంట్రీ దర్శనానికి 2 లేఖలు స్వీకరిస్తామని లేఖలో చంద్రబాబు తెలిపారు.

News December 31, 2024

స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌పై కేసు కొట్టివేత

image

TG: స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై 2019లో నమోదైన కేసును హైకోర్టు తాజాగా కొట్టివేసింది. ఆ ఏడాది ఎన్నికల నియమావళి అమలులో ఉన్న సమయంలో వికారాబాద్ ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆయన చేసిన దీక్ష నియమాల ఉల్లంఘన కిందికే వస్తుందని పేర్కొంటూ అప్పట్లో ఆయనపై కేసు నమోదైంది. దానిపై ప్రసాద్ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా విచారణ జరిపిన ధర్మాసనం, కేసును కొట్టివేస్తున్నట్లు తీర్పునిచ్చింది.