News July 8, 2025
వామ్మో రష్మిక.. గుర్తు పట్టారా!(PHOTO)

‘మైసా’లో లుక్‌తో ప్రేక్షకులను భయపెట్టిన హీరోయిన్ రష్మిక మరో లుక్ వైరలవుతోంది. ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఫొటో షూట్‌లో వెస్టర్న్ లుక్‌లో ఆమె గుర్తు పట్టకుండా మారిపోయారు. దీనిపై అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరేమో కొత్త లుక్ అదిరిపోయిందని కామెంట్లు చేస్తుండగా మరికొందరు దారుణంగా ఉందని ట్రోల్ చేస్తున్నారు. మరి నేషనల్ క్రష్ లేటెస్ట్ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి.
Similar News
News July 8, 2025
ఎన్టీఆర్‌తో నటించడం గౌరవంగా ఉంది: హృతిక్

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి నటించడం తనకు గౌరవంగా ఉందని బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ అన్నారు. ‘వార్ 2’ షూట్ ప్యాకప్ సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. ‘149 రోజుల జర్నీలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా. కియారా అద్వానీతో నటించడం మరిచిపోలేను. ఈ సినిమా యూనిట్ మొత్తానికి కృతజ్ఞతలు. ఆగస్టు 14న మళ్లీ కలుద్దాం’ అంటూ ఆయన పేర్కొన్నారు. కాగా నిన్న హృతిక్‌పై <<16982214>>తారక్ ప్రశంసలు<<>> కురిపించిన విషయం తెలిసిందే.
News July 8, 2025
దేశంలోని భాషలన్నీ జాతీయ భాషలే: RSS

నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా త్రిభాషా విధానంలో హిందీని తప్పనిసరి చేయాలన్న <<16168195>>వివాదం<<>> నేపథ్యంలో RSS కీలక ప్రకటన చేసింది. దేశంలోని భాషలన్నీ జాతీయ భాషలేనని స్పష్టం చేసింది. ఒకే భాషను RSS సమర్థించదని పేర్కొంది. కాగా ఈ విధానం ద్వారా కేంద్రం హిందీని బలవంతంగా రుద్దుతోందని ఇటీవల తమిళనాడు, మహారాష్ట్రలో తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఈక్రమంలోనే RSS నుంచి ప్రకటన వెలువడటం గమనార్హం.
News July 8, 2025
రాత్రి 10 గంటలకు.. ఏం జరగబోతోంది?

US, భారత్ ట్రేడ్ డీల్ ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ట్రంప్ తొలుత విధించిన 26% టారిఫ్‌లను 90 రోజులపాటు నిలిపేసిన విషయం తెలిసిందే. ఆ గడువు నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ రాత్రి 10 గంటలకు మినీ ట్రేడ్ డీల్ ప్రకటన వెలువడే అవకాశముంది. ఇది స్పెషల్ అని ఇటీవల ట్రంప్ వెల్లడించారు. అదేంటన్న ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే 14దేశాలకు టారిఫ్‌లపై లేఖలు పంపిన ట్రంప్ AUG 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించారు.