News October 20, 2025
రాష్ట్రంలో తగ్గిన నూనె గింజ పంటల సాగు విస్తీర్ణం

AP: రాష్ట్రంలో ఈ ఏడాది నూనెగింజ పంటల సాగు విస్తీర్ణం తగ్గింది. ఈ ఏడాది 17 లక్షల ఎకరాల్లో నూనెగింజల పంటలను సాగుచేయాలనుకోగా 6.50 లక్షల ఎకరాల్లో మాత్రమే వేరుశనగతో పాటు ఇతర నూనెగింజల పంటలు సాగయ్యాయి. వరి 38.97 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. పత్తి 11 లక్షల ఎకరాల్లో, చెరకు 30 వేల ఎకరాలకే పరిమితమైంది. మొక్క జొన్న, సజ్జ, చిరుధాన్యాలు, కందులు, ఆముదం, జూట్ వంటి పంటలు లక్ష్యానికి మించి సాగయ్యాయి.
Similar News
News October 20, 2025
రియాజ్ మృతిని ధ్రువీకరించిన DGP

TG: ఎన్‌కౌంటర్‌లో <<18056602>>రియాజ్<<>> మృతిని డీజీపీ శివధర్ రెడ్డి ధ్రువీకరించారు. ‘నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్ ఇవాళ బాత్రూం కోసం వెళ్లి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. పోలీసుల నుంచి వెపన్ తీసుకుని రియాజ్ కాల్పులకు యత్నించాడు. ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపడంతో రియాజ్ చనిపోయాడు’ అని డీజీపీ వెల్లడించారు.
News October 20, 2025
నిజామాబాద్‌లో ఆ రోజు ఏం జరిగింది?

TG: ఓ కేసు విషయంలో కానిస్టేబుల్ ప్రమోద్ శుక్రవారం <<18056602>>రియాజ్‌ను<<>> పట్టుకుని బైకుపై PSకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. రియాజ్ తన దగ్గర ఉన్న కత్తితో ప్రమోద్ ఛాతిలో పొడిచి పారిపోయాడు. ఆ క్రమంలో ఓ ఎస్సైపైనా దాడికి పాల్పడ్డాడు. ప్రమోద్‌ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడని వైద్యులు వెల్లడించారు. రియాజ్‌పై చైన్ స్నాచింగ్, దొంగతనాలు, గొడవల వంటి 60కి పైగా కేసులున్నాయి. నాలుగైదుసార్లు జైలుకెళ్లొచ్చాడు.
News October 20, 2025
పురుగుల బెడద తగ్గించే లింగాకర్షక బుట్టలు

లింగాకర్షక బుట్టల్లో ఉండే ‘ల్యూర్’ మగ రెక్కల పురుగులను ఆకర్షిస్తుంది. ఫలితంగా మగ, ఆడ రెక్కల పురుగుల మధ్య కలయిక జరగకుండా వాటి సంతానోత్పత్తి వృద్ధి చెందకుండా ఉంటుంది. కత్తెర పురుగు, గులాబి రంగు పురుగు, శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు, కూరగాయల్లో పండుఈగ, కొబ్బరి, ఆయిల్ పామ్‌లో కొమ్ము పురుగులకు ప్రత్యేకమైన ల్యూర్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని పొలంలో అమర్చి వాటి ఉద్ధృతిని అదుపులో ఉంచుకోవచ్చు.