News April 29, 2024
ఓలా క్యాబ్స్ సీఈఓ రాజీనామా.. 10% ఉద్యోగులపై వేటు!

ఓలా క్యాబ్స్ సీఈఓ హేమంత్ బక్షి తన పదవి నుంచి తప్పుకున్నారు. ఈ ఏడాది జనవరిలో బాధ్యతలు చేపట్టిన హేమంత్ నాలుగు నెలలు తిరగకుండానే వైదొలగడం గమనార్హం. ప్రస్తుతం ఆ బాధ్యతలను ఓలా సహవ్యవస్థాపకుడు భవేశ్ అగర్వాల్ పర్యవేక్షిస్తారని, త్వరలోనే కొత్త సీఈఓ నియామకం ఉంటుందని సమాచారం. మరోవైపు సంస్థ పునరుద్ధరణలో భాగంగా చేపట్టనున్న చర్యలతో 10% మంది ఉద్యోగులపై వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News November 25, 2025
మహిళలకు మెగ్నీషియం ఎంతో ముఖ్యం

శరీరానికి ముఖ్యమైన ఖనిజాల్లో మెగ్నీషియం ఒకటి. ముఖ్యంగా మహిళలు ఆరోగ్యంగా ఉండటానికి రోజుకు 300 మి.గ్రా మెగ్నీషియం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. హార్మోన్లు, ఎముకల ఆరోగ్యం, ఋతుస్రావం, ప్రెగ్నెన్సీ వంటి అన్ని దశల్లో మెగ్నీషియం ముఖ్యపాత్ర పోషిస్తుంది. గుమ్మడి గింజలు, బచ్చలికూర, బాదం, జీడిపప్పు, పాలు, డార్క్ చాక్లెట్, చిక్కుడు, అవకాడో, పప్పు దినుసులు, అరటిపండు, సోయాపాలలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది.
News November 25, 2025
రేపే ఎన్నికల షెడ్యూల్!

TG: గ్రామాల్లో ఎన్నికల నగరా మోగనుంది. పంచాయతీరాజ్ శాఖ నుంచి రిజర్వేషన్ల జాబితా అందడంతో రేపు సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు SEC సిద్ధమైనట్లు సమాచారం. బుధవారం కుదరకపోతే ఎల్లుండి తప్పనిసరిగా షెడ్యూల్ రిలీజ్ చేయనుంది. షెడ్యూల్, నోటిఫికేషన్, ఎన్నికల తేదీలపై ఇవాళ క్యాబినెట్ భేటీలో సీఎం రేవంత్ సర్కార్ తుది నిర్ణయం తీసుకోనుంది. అనంతరం వీటిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
News November 25, 2025
అధిక సాంద్రత పత్తిసాగు వల్ల ప్రయోజనాలేంటి?

ఒకేసారి పూత, కాయలు రావడం వల్ల పంట తొందరగా చేతికి వస్తుంది. గులాబి రంగు పురుగు తాకిడి తగ్గుతుంది. పంట కాలం త్వరగా పూర్తవ్వడం వల్ల నీటి వసతి ఉంటే రెండో పంటగా ఆరుతడి పంటలను సాగు చేసుకోవచ్చు. దీని వల్ల అదనపు ఆదాయం వస్తుంది. కూలీలు కూడా త్వరగా పత్తి ఏరవచ్చు. ఈ పద్ధతిలో ఎకరాకు సుమారు 30-40% అధిక దిగుబడికి ఛాన్సుంది. దీనికి తక్కువ కాలపరిమితి, భూమికి అనువైన రకాలను, హైబ్రిడ్ విత్తనాలను ఎంపిక చేసుకోవాలి.


