News October 7, 2024

నటుడితో ఓలా ఎలక్ట్రిక్ ఓనర్ వాగ్వాదం: 9% క్రాషైన షేర్లు

image

వరెస్ట్ సర్వీస్ కంప్లైంట్లు, ఇన్వెస్టర్ల ప్రాఫిట్ బుకింగ్‌తో ఇప్పటికే ఓలా ఎలక్ట్రిక్ షేర్లు 43% తగ్గాయి. నటుడు కునాల్‌తో కంపెనీ ఓనర్ భవీశ్ అగర్వాల్ Xలో వాదనకు దిగడంతో నేడు 9% క్రాష్ అయ్యాయి. ‘భారత కస్టమర్లకు గొంతుందా? వాళ్లకిదేనా దక్కేది’ అంటూ దుమ్ముపట్టిన ఓలా స్కూటర్ల ఫొటోను కునాల్ పోస్ట్ చేశారు. ‘సాయం చేస్తే ఈ పెయిడ్ ట్వీట్, మీ ఫెయిల్డ్ కెరీర్లో సంపాదన కన్నా ఎక్కువే ఇస్తాన’ని భవీశ్ స్పందించారు.

Similar News

News October 7, 2024

2047 నాటికి ‘వికసిత్ భారత్’ను మనందరం చూస్తాం: పవన్

image

గుజరాత్ CMగా మోదీ ప్రమాణం చేసి నేటికి 23ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయనకు AP Dy.CM పవన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘విప్లవాత్మక నిర్ణయాలతో కోట్లాది మంది భారతీయుల జీవితాలను మార్చడం ఆరోజు మొదలైంది. ఆయన నాయకత్వంలో దేశం అంతర్జాతీయ స్థాయిలో అన్ని రంగాల్లో దూసుకుపోతూ, 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ను మనం చూస్తామని నమ్ముతున్నాను’ అని ట్వీట్ చేశారు.

News October 7, 2024

RRBలో 7951 జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు.. పరీక్ష తేదీల ప్రకటన

image

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) జూనియర్ ఇంజినీర్ పోస్టుల పరీక్ష తేదీలను ప్రకటించింది. డిసెంబర్ 6 నుంచి 13 వరకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఎగ్జామ్స్ ఉంటాయని తెలిపింది. దీని ద్వారా RRB మొత్తం 7951 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇక అసిస్టెంట్ లోకో పైలట్ పరీక్షలు నవంబర్ 25-29 వరకు, RPF ఎస్సై ఎగ్జామ్స్ డిసెంబర్ 2-5 వరకు, టెక్నీషియన్ ఎగ్జామ్స్ డిసెంబర్ 16-26 వరకు ఉంటాయని వివరించింది.

News October 7, 2024

ఆ కుర్చీలో కూర్చుంటే మరణశాసనం రాసుకున్నట్టేనా!

image

హెజ్బొల్లా చీఫ్ హ‌స‌న్ న‌స్ర‌ల్లాను ఇజ్రాయెల్ హతమార్చడంతో ఆయ‌న వార‌స‌త్వాన్ని స్వీక‌రించ‌డానికి కీల‌క నేత‌లు జంకుతున్నారు. ఆ కుర్చీలో కూర్చోవ‌డ‌మంటే మ‌ర‌ణ‌శాస‌నాన్ని రాసుకున్న‌ట్టే అనే భావ‌న‌లో ఉన్నారు. ఈ కార‌ణంతో ఇరాన్ మ‌ద్ద‌తుగల ఈ సంస్థ ప‌గ్గాలు చేప‌ట్ట‌డానికి కీల‌క నేత ఇబ్ర‌హీం అమీన్ నిరాక‌రించారు. ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో ఈ బాధ్య‌త‌లు ప్రమాదకరమని హెజ్బొల్లా నేతలకు అవగతమైనట్టు తెలుస్తోంది.