News September 12, 2024

షోరూమ్ తగలబెట్టడంపై స్పందించిన OLA

image

కర్ణాటకలోని కలబురగిలో <<14075210>>షోరూమ్‌ను<<>> తగలబెట్టిన ఘటనపై ‘ఓలా’ స్పందించింది. ‘నిన్న కర్ణాటకలోని మా బ్రాండ్ స్టోర్‌ను తగలబెట్టిన వ్యక్తిని గుర్తించాం. స్థానిక పోలీస్ స్టేషన్‌లో FIR నమోదు చేశారు. పోలీసులు అతడిని అరెస్ట్ చేయగా విచారణ కొనసాగుతోంది. ఇలాంటి చట్ట విరుద్ధమైన పనులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని OLA ప్రకటన విడుదల చేసింది.

Similar News

News November 28, 2025

22 ఏళ్లకే సర్పంచ్.. ఊరిని మార్చేందుకు యువతి ముందడుగు!

image

డిగ్రీ, పీజీ పూర్తయ్యాక పట్టణాలకు వలసెళ్లకుండా ఊరిని బాగుచేయాలి అనుకునే యువతకు 22 ఏళ్ల సాక్షి రావత్ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. సర్పంచ్‌గా మారి గ్రామాన్ని అన్ని విధాలుగా తీర్చిదిద్దాలని భావించిన సాక్షికి ఊరి ప్రజల తోడు లభించింది. ఉత్తరాఖండ్‌లోని కుయ్‌ గ్రామ ఎన్నికల్లో ఆమె సర్పంచ్‌గా గెలిచారు. విద్య, ఆరోగ్యం, గ్రామీణ ఉపాధిపై దృష్టి సారించి.. యువ శక్తితో గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని ఆమె తెలిపారు.

News November 28, 2025

పిన్నెల్లి సోదరులకు సుప్రీంలో ఎదురుదెబ్బ

image

AP: YCP నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వారి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేసింది. సరెండర్ కావడానికి 2 వారాల గడువు ఇచ్చింది. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్య కేసులో వీరిద్దరూ నిందితులుగా ఉన్నారు. ముందస్తు బెయిల్ కోసం వారు గతంలో హైకోర్టును ఆశ్రయించగా చుక్కెదురైంది. దీంతో SCని ఆశ్రయించారు.

News November 28, 2025

ఏకగ్రీవాలకు వేలంపాటలు.. SEC వార్నింగ్

image

TG: సర్పంచ్ ఎన్నికల వేళ ఏకగ్రీవాలకు జోరుగా వేలంపాటలు నిర్వహిస్తున్నారు. సర్పంచ్ పదవిని అంగట్లో సరుకులా డబ్బులు కుమ్మరించి కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని పంచాయతీలు ఏకగ్రీవం అయినట్లు ప్రకటించేశారు. దీనిపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆగ్రహించింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోవాల్సిన పదవిని వేలంపాటలో కొనుగోలు చేయడం సరికాదని హితవు పలికింది. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.