News May 26, 2024
జూన్ 14 తర్వాత కూడా పాత ఆధార్ పనిచేస్తుంది: UIDAI

జూన్ 14 తర్వాత పాత ఆధార్ కార్డులు పనిచేయవంటూ జరుగుతున్న ప్రచారాన్ని UIDAI ఖండించింది. గత పదేళ్లుగా ఆధార్ కార్డును ఎలాంటి అప్డేట్ చేసుకోని వారు జూన్ 14లోగా ఉచితంగా అప్డేట్ చేసుకోవాలని సూచించింది. గడువు తర్వాత అప్డేట్ చేసుకోవాలంటే కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. అప్డేట్ చేయని పాత ఆధార్ కార్డులు పని చేయకపోవడం అనేది ఉండదని స్పష్టం చేసింది.
Similar News
News October 15, 2025
సాయంకాలం నిద్రపోతున్నారా?

పగలు ముగిసి, రాత్రి మొదలయ్యే సమయంలో దేవతలందరూ శివ తాండవ వీక్షణలో తన్మయత్వం పొందుతూ ఉంటారు. అందువల్ల దైవ రక్షణ ప్రభావం కొంత మేర తగ్గుతుంది. ఈ అవకాశాన్ని అసుర శక్తులు వాడుకుంటాయి. ప్రజలను బాధించడానికి నిద్ర రూపంలో మనలోకి ప్రవేశించాలని చూస్తాయి. ఈ బలహీనతలకు మనం లొంగితే ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. అందుకే ఈ వేళలో నిద్ర పోవద్దని పెద్దలు అంటుంటారు. * మరిన్ని ధర్మ సందేహాల కోసం <<-se_10013>>భక్తి<<>> కేటగిరీకి వెళ్లండి.
News October 15, 2025
రూ.1కే రీఛార్జ్.. 30 రోజుల పాటు ఫ్రీ కాల్స్, ఇంటర్నెట్

దీపావళి సందర్భంగా కొత్త యూజర్లకు ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL బంపరాఫర్ ప్రకటించింది. రూ.1కే 30 రోజుల పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 2 జీబీ డేటా, 100 SMSలు అందించనున్నట్లు పేర్కొంది. సిమ్ ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపింది. ‘BSNL దీపావళి బొనాంజా’ ఆఫర్ నేటి నుంచి నవంబర్ 15 వరకు అందుబాటులో ఉంటుందని Xలో వెల్లడించింది.
News October 15, 2025
మద్దతు ధరతో పాటు బోనస్ చెల్లింపులకు సిద్ధం: ఉత్తమ్

TG: ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఇబ్బందులు తలెత్తితే 1800-425-00333/1967 హెల్ప్ లైన్ నంబర్కి ఫోన్ చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రైతులకు సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి 48 నుంచి 72 గంటల్లో నగదు చెల్లింపు చేయాలని అధికారులతో సమీక్షలో ఆదేశించారు. ఈ సీజన్లో 148.03 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందని తెలిపారు. మద్దతు ధరతో పాటు బోనస్ చెల్లింపులకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.