News March 13, 2025
పాత సామాను బయటికెళ్లాలి: రాజాసింగ్

TG: రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రావాలంటే పాత సామాను పార్టీ నుంచి బయటికెళ్లి పోవాలని ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణలో ఏ ప్రభుత్వం వస్తే వాళ్లతో రహస్యంగా భేటీ అవుతున్నారు. గొప్పలు చెప్పుకునేవాళ్లకు రిటైర్మెంట్ ఇస్తేనే బీజేపీకి మంచి రోజులు. దీనిపై జాతీయ నాయకత్వం కూడా ఆలోచన చేయాలి. నేనొక్కడినే కాదు.. ప్రతి బీజేపీ కార్యకర్త ఇదే కోరుకుంటున్నాడు’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News March 13, 2025
కిడ్నీలను కాపాడుకుందామిలా

శరీరంలో మూత్రపిండాల పనితీరు చాలా కీలకం. వాటిని కాపాడుకునేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. అవి:
రక్తపోటు, మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలి. పంచదార, ఉప్పు, కొవ్వులు పరిమితంగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. నీరు పుష్కలంగా తాగాలి. డీహైడ్రేషన్ కిడ్నీలకు ప్రమాదకరం. ఇష్టారాజ్యంగా ఔషధాల్ని వాడకూడదు. రక్తపోటు, మధుమేహం, క్రియేటినిన్ స్థాయులపై కన్నేసి ఉంచాలి.
* నేడు ప్రపంచ కిడ్నీ దినోత్సవం
News March 13, 2025
ఇలా చదివితే ఈజీగా గుర్తుంటాయ్!

ఇది పరీక్షల సమయం. సిస్టమేటిక్‌గా చదువుకుంటే ఈజీగా పరీక్షలు రాయొచ్చు. దీనికి పోమోడోర్ టెక్నిక్ (టైమ్ మేనేజ్‌మెంట్) ఎంతో యూజ్‌ఫుల్ అని నిపుణులు చెబుతున్నారు. ‘చదవాల్సిన విషయాన్ని ఎంచుకోండి. దీనికోసం టైమర్‌ని 25 ని.లకు సెట్ చేసుకోండి. టైమర్ పూర్తవగానే ఓ 10 ని.లు బ్రేక్ ఇవ్వండి. నాలుగు సార్లు ఇలా చేశాక 30 ని.లు బ్రేక్ తీసుకోండి. ఇలా చేస్తే దృష్టి మెరుగై పరధ్యానం తగ్గుతుంది’ అని తెలిపారు. SHARE IT
News March 13, 2025
ఒంటిపూట బడులు.. ఉత్తర్వులు జారీ

తెలంగాణలో ఈనెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉ.8 నుంచి మ.12.30 గంటల వరకు స్కూళ్లు నడవనున్నాయి. పదో తరగతి పరీక్ష కేంద్రాలున్న స్కూళ్లలో ఒంటి గంట నుంచి సా.5 వరకు తరగతులు నిర్వహిస్తారు. అటు ఏపీలోనూ ఎల్లుండి నుంచి ఒంటిపూట స్కూళ్లు ప్రారంభం కానున్నాయి.