News July 30, 2024

పాత బస్తీ ఒవైసీ జాగీరా?: బండి సంజయ్

image

TG: అసెంబ్లీలో MIM నేత అక్బరుద్దీన్ వ్యాఖ్యలు ఆయన దురహంకారానికి నిదర్శనమని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఎవరో ఒకరు తప్పు చేస్తే పోలీసు వ్యవస్థనే తప్పుబట్టడం సిగ్గుచేటన్నారు. ‘రాత్రి 10 దాటితే పాతబస్తీలోకి పోలీసులు రాకూడదట. అది ఒవైసీ జాగీరా లేక పాక్‌లో ఉందా? ఇంకా రజాకార్ల పాలనే కొనసాగుతోందని అనుకుంటున్నారేమో. పోలీసుల్ని డ్యూటీ చేయొద్దనడానికి ఒవైసీ ఎవరు?’ అని సంజయ్ ప్రశ్నించారు.

Similar News

News April 6, 2026

ట్రంప్: ముందు బెదిరింపు.. తర్వాత పొడిగింపు!

image

ఇరాన్‌తో యుద్ధంపై US అధ్యక్షుడు ట్రంప్ రోజుకో తీరున ప్రకటన చేస్తూ నవ్వులపాలవుతున్నారు. డీల్ చేసుకోవాలని డెడ్‌లైన్ విధించడం, తర్వాత పొడిగించడం మామూలైపోయింది. మార్చి 21 నుంచి 5సార్లు ఇలానే చేశారు. 48 గంటల్లో హార్ముజ్‌ను తెరవకపోతే <<19577288>>విధ్వంసం<<>> చేస్తామని ప్రకటించి మరుసటి రోజే గడువును 82 గంటలకు పొడిగించామని చెప్పారు. ఆయన డెడ్‌లైన్లు ఆయిల్ ధరల కంటే వేగంగా మారుతున్నాయని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

News April 6, 2026

IPL: చెన్నై పని అయిపోయిందా?

image

అన్ని జట్లపై ఆధిపత్యం చెలాయిస్తూ 5 టైటిల్స్ గెలిచిన చెన్నై.. ఇప్పుడు వరుస ఓటములతో తుస్సుమంటోంది. 200+ టార్గెట్‌ను కాపాడుకోవాలన్నా, 200కు పైగా ఛేజ్ చేయాల్సి ఉన్నా చేతులెత్తేస్తోంది. టీమ్ బ్యాలెన్స్ సరిగా లేదని, బౌలర్లు తేలిపోతున్నారని విశ్లేషకులు అంటున్నారు. ధోనీ వస్తే పరిస్థితి మారుతుందని కొందరు అంటున్నారు. జట్టు బాగాలేనప్పుడు ఎవరు వచ్చినా ఏమీ చేయలేరని మరికొందరు కౌంటర్ ఇస్తున్నారు. COMMENT?

News April 6, 2026

కృతి శెట్టి.. ఈసారైనా హిట్టు కొడతావా క్యూటీ!

image

‘ఉప్పెన’తో తొలి సినిమాకే బ్లాక్‌బస్టర్ కొట్టిన కృతిశెట్టికి సరైన హిట్లు పడటం లేదు. ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’ మినహా తర్వాత చేసిన 7 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. తాజాగా ప్రదీప్ రంగనాథన్‌‌‌‌తో ఆమె చేసిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ మూవీ ఈ నెల 10న రిలీజవుతోంది. ఇదైనా హిట్ అవుతుందేమో చూడాలి. కాగా అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వెంకీ-కళ్యాణ్ రామ్ నటిస్తున్న మూవీలో ఆమె హీరోయిన్‌గా ఎంపికయ్యారు.