News March 19, 2025

పాత ఫోన్.. గంటకు పైగా ఛార్జ్ చేస్తే పేలే ప్రమాదం

image

పాత ఫోన్లు కొనొద్దని నిపుణులు సూచిస్తున్నారు. వాటిలోని చెడిపోయిన బ్యాటరీ స్థానంలో క్వాలిటీ లేని చైనా బ్యాటరీని అమర్చుతారని చెబుతున్నారు. అలాంటి బ్యాటరీని గంటకు పైగా ఛార్జ్ చేస్తే వేడెక్కి పేలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అలాగే ఫోన్‌ను ఎక్కువ సేపు ప్లగ్ ఇన్ చేసి ఉంచకూడదంటున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ రాజ్‌గఢ్ జిల్లాలో సెకండ్ హ్యాండ్ మొబైల్ పేలి ఓ యువకుడికి తీవ్రగాయాలయ్యాయి.

Similar News

News September 14, 2025

రూ.29 లక్షల కోట్ల GSDP లక్ష్యం: చంద్రబాబు

image

AP: ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 10.5% వృద్ధి సాధించినట్లు CM చంద్రబాబు వెల్లడించారు. ఈనెల 15,16 తేదీల్లో నిర్వహించనున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్‌పై మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ప్రభుత్వం అందిస్తున్న పౌరసేవలు, సంక్షేమ పథకాలపై ప్రజల్లో సంతృప్తే ముఖ్యమన్నారు. పౌరసేవలు, సంక్షేమ పథకాలపై పబ్లిక్ పర్సెప్షన్‌ను విశ్లేషిస్తున్నామన్నారు. 2029నాటికి రూ.29 లక్షల కోట్ల GSDP లక్ష్యంగా పనిచేయాలన్నారు.

News September 14, 2025

మీరు ఇలాంటి సబ్బును ఉపయోగిస్తున్నారా?

image

కొందరు ఏది దొరికితే అదే సబ్బుతో స్నానం చేస్తుంటారు. అలా చేయడం వల్ల శరీరానికి హానీ కలుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘ప్రత్యేకంగా సబ్బు వాడాలనుకునేవారు వైద్యుడి సలహా తీసుకోవాలి. కొబ్బరి నూనె, షియా బటర్, కలబంద, తేనె వంటి సహజ పదార్థాలతో చేసిన సోప్ వాడాలి. ఇవి చర్మం, ఆరోగ్యానికి ఎలాంటి హాని చేయవు. రసాయనాలు కలిపిన సబ్బులతో స్నానం చేస్తే చికాకు, ఆందోళన, అనారోగ్యం పాలవుతారు’ అని వారు చెబుతున్నారు.

News September 14, 2025

NTR స్మృతివనంలో విగ్రహం ఏర్పాటుపై సమీక్ష

image

AP: అమరావతిలోని నీరుకొండ వద్ద నిర్మించే NTR స్మృతివనం తెలుగువారి ఆత్మగౌరవం-ఆత్మవిశ్వాసం కలగలిపి వైభవంగా ఉండాలని CM చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ ప్రాజెక్టులో తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు, భాష, సాహిత్యం, ప్రాచీన చరిత్రకు పెద్దపీట వేయాలన్నారు. NTR విగ్రహం ఏర్పాటుపై సమీక్షించారు. ఇందులో అల్లూరి సీతారామరాజు, పొట్టి శ్రీరాములు వంటి విశిష్ట వ్యక్తుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని సూచించారు.