News May 11, 2024
ఓటరు చీటీల్లో పాత పోలింగ్ వేళలే!

TG: ఎల్లుండే పోలింగ్ కావడంతో ఓటరు చీటీల పంపిణీ వేగంగా జరుగుతోంది. అయితే చీటీల్లో పోలింగ్ వేళలు పాతవే ఉండటం ఓటర్లను అయోమయానికి గురి చేస్తోంది. సాధారణంగా పోలింగ్ సమయం ఉ.7 గంటల నుంచి సా.5 గంటల వరకు ఉంటుంది. ఎండాకాలం కావడంతో సమయం పెంచాలన్న రాజకీయ పార్టీల విజ్ఞప్తితో ఈసీ సా.6 గంటల వరకు పొడిగించింది. కానీ చీటీల్లో మాత్రం పాత టైమింగ్సే ఉన్నాయి. అప్పటికే చీటీలు ప్రింట్ కావడమే అందుకు కారణమని తెలుస్తోంది.
Similar News
News November 3, 2025
నేల ద్వారా వ్యాపించే తెగుళ్లు – కట్టడికి సూచనలు

ట్రైకోడెర్మావిరిడె/సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ 2 కేజీల మందును.. 90 కేజీల పశువుల ఎరువు, 10 కేజీల వేపపిండితో కలిపి నీడలో పొరలు పొరలుగా ఒక కుప్పగా వేసుకోవాలి. దానిపై గోనెకప్పి బెల్లం కలిపిన నీటిని ఒక వారం పాటు చల్లాలి. దీని వల్ల దానిలో శిలీంద్రబీజాలు/బ్యాక్టీరియా బాగా వృద్ధి చెందుతుంది. ఇలా తయారైన దానిని పశువుల ఎరువుతో కలిపి ఎకరా పొలంలో చల్లుకోవాలి. ఇది నేలసారాన్ని పెంచి తెగుళ్ల ఉద్ధృతిని తగ్గిస్తుంది.
News November 3, 2025
చెత్త పనులు చేయడం వైసీపీకి పరిపాటిగా మారింది: మంత్రి లోకేశ్

AP: డ్రగ్స్ సరఫరా చేస్తున్న YCP స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడు కొండారెడ్డిని ఈగల్ టీమ్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. ‘డ్రగ్స్ వద్దని ప్రభుత్వం యుద్ధం చేస్తుంటే YCP పాత వాసనలు వదులుకోవట్లేదు. చెత్త పనులు చేయడం, రాష్ట్రంలో ఏదో అయిపోతుందంటూ హడావుడి చేయడం పరిపాటిగా మారింది. YCP ఫేక్ పార్టీ అని అనేది అందుకే. ఆ పార్టీ నడిపేది స్టూడెంట్ వింగ్ కాదు, డ్రగ్స్ వింగ్’ అని ఆరోపించారు.
News November 3, 2025
ఇతిహాసాలు క్విజ్ – 55 సమాధానాలు

1. అయోధ్య నగరాన్ని ‘మను చక్రవర్తి’ నిర్మించారు.
2. విచిత్రవీర్యుని తండ్రి ‘శంతనుడు’.
3. కృష్ణుడు గోవర్ధన గిరిని ‘ఏడు’ రోజులు ఎత్తి పట్టుకున్నాడు.
4. మనిషి శరీరంలోని ఏడు శక్తి కేంద్రాలను ‘చక్రాలు’ అని అంటారు.
5. జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందడాన్ని‘మోక్షం’ అని అంటారు.
<<-se>>#Ithihasaluquiz<<>>


