News July 16, 2024
విద్యాదీవెన, వసతిదీవెన స్థానంలో పాత విధానం: లోకేశ్

AP: విద్యాదీవెన, వసతిదీవెన స్థానంలో పాత ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానాన్ని అమలు చేసేందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించాలని మంత్రి లోకేశ్ ఆదేశించారు. గత ప్రభుత్వం రూ.3,480 కోట్ల బకాయిలు పెట్టడంతో విద్యార్థుల సర్టిఫికెట్లు ఆయా విద్యాసంస్థల్లో నిలిచిపోయాయన్నారు. దీంతో విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని లోకేశ్ తెలిపారు. కాలేజీల్లో డ్రగ్స్ నిర్మూలనకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Similar News
News January 23, 2026
147పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ &రీసెర్చ్<
News January 23, 2026
పూజ చేయడం వెనుక సైంటిఫిక్ రీజన్

పూజ భక్తి మాత్రమే కాదు. గొప్ప మానసిక ప్రక్రియ కూడా. పూజలో వాడే గంటల శబ్దం మెదడులోని రెండు భాగాలను ఏకం చేసి ఏకాగ్రతను పెంచుతుంది. దీపపు కాంతి కంటి చూపును మెరుగుపరుస్తుంది. కర్పూరం, ధూపం గాలిలోని సూక్ష్మక్రిములను సంహరించి స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను అందిస్తాయి. మంత్రోచ్ఛారణ తరంగాలు రక్తపోటును తగ్గిస్తాయి. మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. పంచేంద్రియాలను ఉత్తేజపరిచి, శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.
News January 23, 2026
రాహుల్, థరూర్ మధ్య ముదిరిన విభేదాలు?

రాహుల్ గాంధీపై శశి థరూర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కొచ్చిలో జరిగిన సమావేశంలో వేదికపై తన పేరును రాహుల్ కావాలనే ప్రస్తావించలేదని థరూర్ నొచ్చుకున్నట్లు సమాచారం. దీంతో కేరళ ఎన్నికల సన్నద్ధతపై నేడు నిర్వహించనున్న కీలక సమావేశానికి ఆయన డుమ్మా కొట్టనున్నట్లు తెలుస్తోంది. గతంలో PM మోదీని పొగిడారనే కారణంతో పార్టీ నాయకత్వం థరూర్‌ను పక్కన పెడుతోందన్న ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.


