News February 6, 2025
కాంగ్రెస్ రాకతో పాత కష్టాలు: కేటీఆర్
TG: రాష్ట్ర సచివాలయంలోనే కాదు గ్రామ సచివాలయాల్లోనూ పాలన పడకేసిందని మాజీ మంత్రి కేటీఆర్ Xలో విమర్శించారు. గ్రామాలన్నీ సమస్యల ఊబిలో చిక్కుకున్నాయని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ హయాంలో పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయని, కాంగ్రెస్ వచ్చి పాత కష్టాలు తీసుకొచ్చిందని విమర్శించారు. సీఎం ఇకనైనా మొద్దునిద్ర వీడాలని, గ్రామాల్లో సమస్యల పంచాయితీని తేల్చాలని రాసుకొచ్చారు. ప్రజా పాలన అంటే ఇదేనా అని ప్రశ్నించారు.
Similar News
News February 6, 2025
ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఈయనే!
ఫ్రాన్స్‌కు చెందిన టిబెటన్ బౌద్ధ సన్యాసి మాథ్యూ రికార్డ్‌ని ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన వ్యక్తిగా గుర్తించారు. మాథ్యూపై విస్కాన్సిన్ యూనివర్సిటీ న్యూరో సైంటిస్టులు అతని పుర్రెకు 256 సెన్సార్లు బిగించి 12 ఏళ్ల పాటు అధ్యయనం చేశారు. ఆయన ధ్యానం చేసినప్పుడు బ్రెయిన్ చార్టుల నుంచి గామా తరంగాల ఉత్పత్తి స్థాయిని చూసి పరిశోధకులు ఆశ్చర్యపోయారు. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదని చెప్పారు.
News February 6, 2025
మా కలలన్నీ ఛిద్రమయ్యాయి: అక్రమ వలసదారుల కన్నీళ్లు
104మంది అక్రమ వలసదారుల్ని US తిప్పి పంపిన సంగతి తెలిసిందే. అక్కడికి వెళ్లేందుకు వారు పడిన బాధలు గుండెల్ని పిండుతున్నాయి. ‘చట్టప్రకారం అమెరికా తీసుకెళ్తామని ఏజెంట్ రూ.30 లక్షలు తీసుకున్నాడు. కానీ చట్ట విరుద్ధంగా బోర్డర్ దాటించాడు. దారిలో ఎన్నో ఘోరాలు చూశాం. ఎంతోమంది చనిపోయారు. ఎక్కడైతే బయలుదేరామో ఇప్పుడు తిరిగి అక్కడికే చేరాం. మా కలలన్నీ ఛిద్రమయ్యాయి’ అంటూ వారు కంటనీరు పెట్టుకుంటున్నారు.
News February 6, 2025
న్యూడ్ వీడియోల కేసు.. వారికి నోటీసులు!
అమ్మాయిల న్యూడ్ వీడియోల కేసు కొత్త మలుపు తీసుకుంటోంది. మస్తాన్ సాయి ఇంట్లో డ్రగ్స్ పార్టీ జరిగిందని నిన్న లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు చర్యలకు దిగినట్లు సమాచారం. వీడియోలో ఉన్న సినీ ప్రముఖులు, ఇతరులకు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు లావణ్య ఇచ్చిన హార్డ్ డిస్క్‌ను పోలీసులు ఫోరెన్సిక్‌కు పంపించారు.