News June 23, 2024
అన్న అబ్బాయిల్ని.. తమ్ముడు అమ్మాయిల్ని..!

మాజీ ప్రధాని దేవెగౌడ కుటుంబ గౌరవం మసకబారుతోంది. ఆయన కొడుకు HD రేవణ్ణ కుమారులు <<13495776>>సూరజ్<<>>(అన్న), <<13415105>>ప్రజ్వల్<<>>(తమ్ముడు) లైంగిక వేధింపుల కేసుల్లో కటకటాలపాలయ్యారు. మహిళలను అత్యాచారం చేసిన కేసులో ప్రజ్వల్, పార్టీ కార్యకర్తపై అసహజ శృంగారానికి పాల్పడిన కేసులో సూరజ్ అరెస్ట్ అయ్యారు. ఇక ప్రజ్వల్కు తల్లి భవానీ సహకరించారని విచారణలో తేలగా, గతంలో HD రేవణ్ణపైనా లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి.
Similar News
News November 7, 2025
చరిత్ర సృష్టించిన మస్క్.. $1 ట్రిలియన్ ప్యాకేజ్

టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ రికార్డు సృష్టించారు. ఆయనకు $1 ట్రిలియన్ (₹88 లక్షల కోట్లు) ప్యాకేజ్ ఇచ్చేందుకు 75% టెస్లా షేర్హోల్డర్లు ఆమోదం తెలిపారు. దీంతో కార్పొరేట్ రంగంలో అత్యంత ఎక్కువ ప్యాకేజ్ గల CEOగా చరిత్ర సృష్టించారు. అయితే మస్క్ నెల జీతంగా కాకుండా ఆ మొత్తాన్ని వచ్చే పదేళ్లలో స్టాక్స్ రూపంలో పొందుతారు. ప్రస్తుతం 476 బి.డాలర్లతో మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్నారు.
News November 7, 2025
హెక్టారుకు ₹50,000 ఆర్థికసాయం: అచ్చెన్న

AP: రేట్లు లేక నష్టపోయిన ఉల్లి రైతులకు త్వరలోనే హెక్టారుకు ₹50వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కర్నూలు, కడప జిల్లాల్లో 20,913 మంది రైతులకు ₹104.57 కోట్ల సాయం అందుతుందన్నారు. ధరలు పడిపోయినప్పుడు క్వింటాలుకు ₹1,200 చొప్పున ₹18కోట్ల సరకు కొనుగోలు చేశామని గుర్తుచేశారు. ఇప్పటికే ₹10 కోట్లు ఇచ్చామని, మరో ₹8కోట్లు త్వరలో చెల్లిస్తామని పేర్కొన్నారు.
News November 7, 2025
SBI అరుదైన ఘనత

మార్కెట్ విలువలో 100 బిలియన్ డాలర్ల(రూ.8.8 లక్షల కోట్లు) కంపెనీగా SBI నిలిచింది. ఈ ఘనత సాధించిన ఆరో భారత కంపెనీగా, తొలి ప్రభుత్వ రంగ సంస్థగా రికార్డు సృష్టించింది. నిన్న SBI షేరు జీవితకాల గరిష్ఠం రూ.971.15కు చేరడంతో ఈ ఘనత సాధ్యమైంది. ఈ జాబితాలో ఇప్పటి వరకు రిలయన్స్, HDFC బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, టీసీఎస్, ICICI బ్యాంక్ ఉన్నాయి.


