News October 1, 2024

ఒంటరి జీవితంవైపు వృద్ధుల మొగ్గు

image

జీవిత చరమాంకంలో ఒంటరిగా నివసించే వృద్ధుల సంఖ్య పెరుగుతున్నట్లు ‘ఏజ్‌వెల్ ఫౌండేషన్’ అధ్యయనం వెల్లడించింది. ఆర్థిక, సామాజిక స్వాతంత్ర్యానికి ప్రాధాన్యం పెరగడమే కారణమని తెలిపింది. దేశంలో 10వేల మంది వృద్ధులపై సర్వే చేయగా 14.3% మంది ఒంటరిగా జీవిస్తున్నట్లు చెప్పారు. ఈ సంఖ్య పట్టణాల్లో 15%, గ్రామాల్లో 13.4 శాతంగా ఉంది. వీరిలో 46.9% మంది సంతోషంగా ఉన్నట్లు చెప్పగా, 41.5% మంది అసంతృప్తి వ్యక్తం చేశారు.

Similar News

News January 5, 2026

పాలకొల్లు: ఇంటికి వెళ్లడానికి 4 గంటలు ఉందనగా..

image

పాలకొల్లుకు చెందిన దంపతులు అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సోమవారం మృతి చెందారు. క్రిస్మస్ సెలవులకు స్వగ్రామం వచ్చి, తిరిగి వెళ్తుండగా ఇంటికి చేరడానికి మరో 4 గంటల సమయం ఉందనగా ఈ విషాదం జరిగింది. మృతులు కొటికలపూడి రాజమోహన్ రావు కుమారుడు, కోడలుగా గుర్తించారు. తల్లిదండ్రుల ఆరోగ్యం బాగోలేదని వచ్చి చూసి వెళ్తుండగా మృత్యువాత పడటంతో పాలకొల్లులో విషాద ఛాయలు అలముకున్నాయి.

News January 5, 2026

J&K మొత్తం ఇండియాలోనే ఉండాలి: బాబ్ బ్లాక్‌మన్

image

POK సహా J&K అంతా ఇండియాలోనే ఉండాలని బ్రిటన్ MP బాబ్ బ్లాక్‌మన్ అభిప్రాయపడ్డారు. ఈ అంశంలో భారత్‌కు అంతర్జాతీయ సమాజం మద్దతు ఇవ్వాలని జైపూర్లోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌ సభలో పిలుపునిచ్చారు. ఆర్టికల్ 370ని తొలగించాలని 1992లోనే చెప్పానన్నారు. కశ్మీరీ పండితులను అక్కడి నుంచి వెళ్లగొట్టడాన్ని వ్యతిరేకించానని గుర్తుచేశారు. మతం పేరిట ప్రజలను వెళ్లగొట్టడం అన్యాయమని ప్రపంచానికి తెలిపానన్నారు.

News January 5, 2026

IPL ప్రసారంపై బ్యాన్.. బంగ్లా సంచలన నిర్ణయం

image

భారత్‌తో వైరం ముదరడంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో IPL ప్రసారంపై నిషేధం విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఈ బ్యాన్ అమలు చేయాలని బ్రాడ్‌కాస్టర్లను ఆదేశించింది. బంగ్లాలో హిందువులపై దాడుల నేపథ్యంలో KKR టీమ్ నుంచి ముస్తాఫిజుర్‌ను <<18748860>>తీసేయడంతో<<>> ఈ వివాదం చెలరేగింది. తాము T20 WC కోసం భారత్‌కు రాబోమని ICCకి BCB <<18761652>>లేఖ<<>> రాసింది. ఈక్రమంలోనే IPL ప్రసారంపై బ్యాన్ విధించింది.