News April 7, 2025
ఒలింపిక్ మెడలిస్ట్ మేరీ కోమ్ విడాకులు?

ఒలింపిక్ మెడలిస్ట్, బాక్సింగ్ ఐకాన్ మేరీకోమ్ వ్యక్తిగత జీవితంలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. భర్త కరంగ్ ఓంఖోలర్(ఓంలర్)తో ఆమె విడాకులకు సిద్ధమైనట్లు వార్తలొస్తున్నాయి. మరో బాక్సర్ భర్తతో ఆమె ప్రేమలో పడ్డారని, ప్రస్తుతం ఆయన తన బిజినెస్ పార్ట్నర్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనతో కలసి దిగిన ఫొటోలు ఇన్‌స్టాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇవన్నీ పుకార్లేనని కొందరు కొట్టిపడేస్తున్నారు.
Similar News
News April 7, 2025
ట్రెంట్ బౌల్ట్ చెత్త రికార్డు

RCBతో జరుగుతున్న మ్యాచ్‌లో MI బౌలర్ ట్రెంట్ బౌల్ట్ చెత్త రికార్డు నమోదు చేశారు. 4 ఓవర్లలో 57 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీసిన అతనికి IPLలో ఇదే మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్పెల్. 2018లో CSK, 2020లో PBKS, 2022లో KKR, 2024లో DCపై 48 పరుగుల చొప్పున ఇచ్చారు.
News April 7, 2025
వడ్డీ రేట్లు తగ్గించిన HDFC

HDFCలో లోన్లు(హోమ్, పర్సనల్, వెహికల్) తీసుకున్న వారికి శుభవార్త. వడ్డీ రేట్లపై 10 బేసిక్ పాయింట్లను బ్యాంక్ తగ్గించింది. దీంతో ఒక్క రోజు నుంచి మూడేళ్ల వ్యవధిలోని లోన్లపై వడ్డీ 9.10 నుంచి 9.35 శాతం మధ్య ఉండనుంది. గతంలో ఈ రేట్లు 9.20-9.45 శాతంగా ఉండేవి. ఇవాళ్టి నుంచే కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి.
News April 7, 2025
బిగ్‌బాస్ సీజన్-9కు బాలయ్య హోస్ట్?

టీవీ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ తెలుగులో 8 సీజన్లు పూర్తి చేసుకుంది. త్వరలో తొమ్మిదో సీజన్ ప్రారంభం కానుంది. ఈసారి అక్కినేని నాగార్జున హోస్ట్‌గా ఉండకపోవచ్చని సమాచారం. తొమ్మిదో సీజన్‌కు సినీ నటుడు నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆయనతో చర్చలు జరిపినట్లు టాక్. దీనిపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. మరి ఈ షోను ఎవరు హోస్ట్ చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి.