News August 1, 2024

OLYMPICS: అథ్లెట్లకు 2 లక్షల కండోమ్‌లు పంపిణీ

image

పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్లకు నిర్వాహకులు 2 లక్షలకుపైగా కండోమ్‌లు పంపిణీ చేశారు. పురుషులకు 2 లక్షలు, మహిళలకు 20 వేల కండోమ్‌లతోపాటు 10 వేల ఓరల్ డ్యామ్‌లు అందించారు. అథ్లెట్లు ఉత్సాహంగా, సౌకర్యవంతంగా ఉండేందుకు వీటిని పంపిణీ చేశారు. కాగా 1988 సియోల్ ఒలింపిక్స్ నుంచి క్రీడాకారులకు వీటిని పంపిణీ చేస్తున్నారు.
<<-se>>#Olympics2024<<>>

Similar News

News January 28, 2026

ఇందిరమ్మ ఇళ్లు.. లంచం అడిగితే ఈ నంబర్‌కు కాల్ చేయండి!

image

TG: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ స్పష్టం చేశారు. లబ్ధిదారుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ హౌసింగ్ ఏఈ శ్రీకాంత్‌ను బ్లాక్ లిస్టులో పెట్టామని తెలిపారు. అధికారులు నిరాకరిస్తే ఇళ్ల ఫొటోలు లబ్ధిదారులే యాప్‌లో పెట్టవచ్చని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్‌లో లంచం అడిగితే 1800 599 5991కు కాల్ చేయాలని సూచించారు.

News January 28, 2026

RTC ఉద్యోగులకు గుడ్ న్యూస్

image

AP: RTCలో పనిచేస్తున్న 4వేల మందికి పైగా ఉద్యోగులకు ప్రమోషన్లు రానున్నాయి. ADC/కంట్రోలర్, లీడింగ్ హెడ్స్‌లకు పదోన్నతి లభిస్తుంది. నిర్ణీత టెస్ట్ పాసైన కండక్టర్లు Jr అసిస్టెంట్లు కానున్నారు. ‘గత OCTలోనే 7500 మందికి ప్రమోషన్‌పై GO వచ్చినా 550 మందికే ఇచ్చారు. దీనిపై లేఖ ఇవ్వగా సీనియార్టీపై క్లారిటీ ఇస్తూ MD ఆదేశాలిచ్చారు. వారంలోపే మిగతా వారికీ పదోన్నతి వస్తుంది’ అని EU నేతలు దామోదర్, నరసయ్య తెలిపారు.

News January 28, 2026

రూ.1,002 కోట్లు.. తొలి ఇండియన్ సినిమాగా ధురంధర్

image

రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్యధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం ఇండియాలోనే రూ.1,002కోట్ల (గ్రాస్) వసూళ్లు సాధించింది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా హిందీలో విడుదలై వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన ఇండియన్ సినిమాగా రికార్డులకెక్కింది. షారుఖ్ ఖాన్ జవాన్ (రూ.760) రికార్డులు బద్దలుకొట్టింది.