News August 3, 2024

Olympics: 20 ఏళ్లలో తొలిసారి.. 60 ఏళ్లలో మరోసారి

image

ఒలింపిక్స్‌లో సత్తా చాటాలనే కోరిక ఉండాలేగానీ వయసుతో సంబంధం లేదని నిరూపించారో షూటర్. వెనిజులాకు చెందిన లియోనల్ మార్టినెజ్ 20ఏళ్ల కుర్రాడిగా 1984 ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు. తర్వాత ఆటకు దూరమయ్యారు. 40 ఏళ్ల తర్వాత అతనికి మళ్లీ ఆటపై మనసు మళ్లింది. గతేడాది పాన్ అమెరికన్ క్రీడల్లో రజతం సాధించి ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. 60 ఏళ్ల వయసులో ట్రాప్ ఈవెంట్‌లో పాల్గొని 28వ స్థానంలో నిలిచారు.
<<-se>>#Olympics2024<<>>

Similar News

News October 20, 2025

నిజామాబాద్‌లో ఆ రోజు ఏం జరిగింది?

image

TG: ఓ కేసు విషయంలో కానిస్టేబుల్ ప్రమోద్ శుక్రవారం <<18056602>>రియాజ్‌ను<<>> పట్టుకుని బైకుపై PSకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. రియాజ్ తన దగ్గర ఉన్న కత్తితో ప్రమోద్ ఛాతిలో పొడిచి పారిపోయాడు. ఆ క్రమంలో ఓ ఎస్సైపైనా దాడికి పాల్పడ్డాడు. ప్రమోద్‌ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడని వైద్యులు వెల్లడించారు. రియాజ్‌పై చైన్ స్నాచింగ్, దొంగతనాలు, గొడవల వంటి 60కి పైగా కేసులున్నాయి. నాలుగైదుసార్లు జైలుకెళ్లొచ్చాడు.

News October 20, 2025

పురుగుల బెడద తగ్గించే లింగాకర్షక బుట్టలు

image

లింగాకర్షక బుట్టల్లో ఉండే ‘ల్యూర్’ మగ రెక్కల పురుగులను ఆకర్షిస్తుంది. ఫలితంగా మగ, ఆడ రెక్కల పురుగుల మధ్య కలయిక జరగకుండా వాటి సంతానోత్పత్తి వృద్ధి చెందకుండా ఉంటుంది. కత్తెర పురుగు, గులాబి రంగు పురుగు, శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు, కూరగాయల్లో పండుఈగ, కొబ్బరి, ఆయిల్ పామ్‌లో కొమ్ము పురుగులకు ప్రత్యేకమైన ల్యూర్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని పొలంలో అమర్చి వాటి ఉద్ధృతిని అదుపులో ఉంచుకోవచ్చు.

News October 20, 2025

మెరిసే చర్మం కోసం ఈ ఫేస్ ప్యాక్‌లు

image

అందంగా కనిపించాలని ఎవరికి ఉండదు చెప్పండి. దీనికోసం ఇంట్లోనే ఉండే కొన్నిపదార్థాలతో ఈ ప్యాక్స్ ట్రై చేసి చూడండి. * పెరుగు, తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాలు ఉంచి మెల్లగా మసాజ్ చేస్తూ కడిగేయాలి. దీంతో ముఖానికి మంచి గ్లో వస్తుంది. * పసుపు, గంధం, పాలు, రోజ్ వాటర్ కలిపి మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఈ ప్యాక్ వారానికి రెండుసార్లు వేస్తే ముఖం అందంగా మెరిసిపోతుంది.