News August 9, 2024
ఒలింపిక్స్: ఏ ఆటకు ఎంత ఖర్చంటే..

కేంద్రం పారిస్ ఒలింపిక్స్ క్రీడాకారుల కోసం రూ.470కోట్లు వెచ్చించింది. అత్యధికంగా అథ్లెటిక్స్కు ₹96.08కోట్లు కేటాయించింది. ఆ తర్వాత బ్యాడ్మింటన్(₹72.03Cr), బాక్సింగ్(₹60.93Cr), షూటింగ్(₹60.42Cr), హాకీ(₹41.3Cr), ఆర్చరీ(₹39.18Cr), రెజ్లింగ్(₹37.8Cr), W.లిఫ్టింగ్(₹27Cr), T.టెన్నిస్(₹12.9Cr), జూడో(₹6.3Cr), రోయింగ్(₹3.89Cr), స్విమ్మింగ్(₹3.8Cr), సెయిలింగ్(₹3.78Cr), గోల్ఫ్(₹1.7Cr), టెన్నిస్(₹1.67Cr).
Similar News
News December 3, 2025
సిరిసిల్ల: రెండో దశ.. పంచాయతీలకు 603 నామినేషన్లు

జిల్లాలో రెండో దశ పంచాయతీ ఎన్నికల కోసం 603 నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 88 పంచాయతీలకు గాను చివరిరోజు మంగళవారం 292 నామినేషన్లు స్వీకరించగా మొత్తం నామినేషన్ల సంఖ్య 603కు చేరిందని అధికారులు తెలిపారు. 758 వార్డులకు గాను మంగళవారం 1,119 నామినేషన్లు రాగా మొత్తం 1,811 నామినేషన్లు అందినట్లు వివరించారు. నేడు నామినేషన్ల పరిశీలన ప్రక్రియను నిర్వహించనున్నారు.
News December 3, 2025
ధోనీ రూమ్లో చాలా చేసేవాళ్లం: మైక్ హస్సీ

క్రికెట్ మైదానంలో ఎంతో ప్రశాంతంగా ఉండే ధోనీ ఆఫ్ఫీల్డ్లో ఎలా ఉంటారో CSK మాజీ ఆటగాడు, కోచ్ హస్సీ వెల్లడించారు. ప్రతి IPL సీజన్లో ధోనీ రూమ్ అనధికారిక టీమ్ లాంజ్లా మారేదన్నారు. ప్లేయర్లు 24 గంటలూ అక్కడే మాట్లాడుకోవడం, ఫుడ్ షేర్ చేసుకోవడం, కొందరు హుక్కాతో రిలాక్స్ అవ్వడం జరిగేదన్నారు. ఇటువంటి బాండింగ్ కారణంగానే CSK ఒక కుటుంబంలా మారిందని అభిప్రాయపడ్డారు.
News December 3, 2025
సమంతతో పెళ్లిపై రాజ్ సోదరి ఎమోషనల్ పోస్ట్!

సమంతను తమ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ రాజ్ నిడిమోరు సోదరి శీతల్ ఇన్స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘చంద్రకుండ్లో శివుడిని ప్రార్థిస్తూ లింగాన్ని ఆలింగనం చేసుకున్నా. ఆనందబాష్పాలతో నా హృదయం ఉప్పొంగుతోంది. ఇప్పుడు మా కుటుంబం పరిపూర్ణమైంది. వీరికి మేమంతా అండగా ఉంటాం. వాళ్లను చూస్తుంటే గర్వంగా ఉంది’ అని ఆమె రాసుకొచ్చారు. ‘లవ్ యూ’ అని సామ్ దీనికి రిప్లై ఇచ్చారు.


