News July 28, 2024
OLYMPICS: సెమీ ఫైనల్స్‌కు భారత స్విమ్మర్

ఒలింపిక్స్‌లో భారత మహిళా స్విమ్మర్ దినిది దేశింగు సెమీ ఫైనల్స్‌కు చేరారు. మహిళల 200 మీటర్ల ఫ్రీస్టైల్ హీట్-1లో ఆమె లక్ష్యాన్ని 2.06.36 నిమిషాల్లో చేరుకుని తొలి స్థానంలో నిలిచారు.
Similar News
News October 20, 2025
509 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

ఢిల్లీ పోలీస్ విభాగంలో 509 హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఇంటర్ అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పురుషులకు 341, మహిళలకు 168 జాబ్‌లు ఉన్నాయి. వయసు 18- 25 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాతపరీక్ష, PE&MT, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.100. SC, STలకు ఫీజు లేదు. వెబ్సైట్: https://ssc.gov.in
News October 20, 2025
దీపావళి రోజున కచ్చితంగా చేయాల్సిన పనులు

లక్ష్మీదేవికి పరిశుభ్రత అంటే ఇష్టం. అందుకే ఇంటిని శుభ్రంగా ఉంచి, ప్రతి మూల దీపాలు వెలిగించి పూజ చేయాలి. పూజ సమయంలో విగ్రహం (లేదా) ఫొటోను ఎర్రటి వస్త్రంపై ఉంచాలి. పూజను తూర్పు (లేదా) ఈశాన్య మూలలో చేయాలి. ఇంటి గుమ్మం వద్ద కుంకుమ, పసుపుతో స్వస్తిక్ వేసి, గడపకు పూజ చేయాలి. ఇది పాజిటివ్ శక్తిని ఆకర్షిస్తుంది. పూజలో భాగంగా అఖండ దీపం వెలిగిస్తే.. అది మరుసటి రోజు ఉదయం వరకు ఆరిపోకుండా జాగ్రత్త వహించాలి.
News October 20, 2025
వచ్చే నెల 3 నుంచి కాలేజీల బంద్!

TG: ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోతే వచ్చే నెల 3 నుంచి కాలేజీల బంద్ చేపడుతామని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు తెలిపాయి. బకాయిలు చెల్లించాలని ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావుకు వినతి పత్రం అందజేశాయి. ప్రభుత్వం హామీ ఇచ్చిన రూ.900 కోట్లను నవంబర్ 1వ తేదీలోపు రిలీజ్ చేయాలని కోరాయి. బంద్‌కు సంబంధించి ఈ నెల 22న ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వనున్నట్లు వెల్లడించాయి.