News July 28, 2024

ఒలింపిక్స్: ఆర్చరీలో భారత్ ఉమెన్స్ టీమ్ ఔట్

image

పతక ఆశలతో క్వార్టర్ ఫైనల్స్‌కి ఎంట్రీ ఇచ్చిన భారత మహిళల ఆర్చరీ జట్టు నిరాశపర్చింది. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దీపికా, భజన్ కౌర్, అంకిత జట్టు 0-6 తేడాతో ఓడిపోయింది. కాగా ఈ విభాగంలో సెమీ ఫైనల్స్, ఫైనల్స్ ఈరోజే పూర్తి కానున్నాయి. ఒలింపిక్స్‌లో ఆర్చరీ పోటీలు మొదలై 36 ఏళ్లు గడిచినా ఇంతవరకూ భారత టీమ్‌కు ఒక్క మెడల్ కూడా రాలేదు. రేపు క్వార్టర్ ఫైనల్స్ ఆడనున్న మెన్స్ జట్టుపైనే ఆశలు నెలకొన్నాయి.

Similar News

News October 25, 2025

వరల్డ్ కప్.. RO-KO ఆడతారహో!

image

క్రికెట్ ప్రపంచం మొత్తం ‘RO-KO’ అంటూ నినదిస్తోంది. AUSపై మూడో వన్డేలో రోహిత్(121*)-కోహ్లీ(74*) అదరగొట్టేశారు. ఈ ప్రదర్శనతో ఫ్యాన్స్‌లో WC-2027పై ఆశలు చిగురించాయి. మ్యాచ్ తర్వాత ఇంటర్వ్యూలో వరల్డ్ కప్ గురించి అడగ్గా.. ఎగ్జైటెడ్‌గా ఉన్నామని రోహిత్, కోహ్లీ సమాధానం చెప్పారు. దీంతో ‘వీళ్లకు ఏజ్ జస్ట్ ఏ నంబర్, వరల్డ్ కప్‌కు రో-కో వస్తున్నారు, ఈ జోడీ ఉంటే కప్పు మనదే’ అంటూ SMలో పోస్టులు పెడుతున్నారు.

News October 25, 2025

అనుమతి లేకుండా చిరంజీవి పేరు, ఫొటోలు వాడొద్దు: కోర్టు

image

అనుమతి లేకుండా చిరంజీవి పేరును వాణిజ్య ప్రయోజనాలకు వాడకూడదని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు స్పష్టం చేసింది. పేరు, ఫొటోల ఏఐ మార్ఫింగ్‌తో తన ప్రతిష్ఠ దెబ్బతింటోందని ఇటీవల చిరు కోర్టును ఆశ్రయించారు. ఈక్రమంలోనే ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. టీఆర్పీ, లాభాల కోసం చిరంజీవి పేరును దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ కేసులో 30 మందికి నోటీసులు జారీ చేసింది.

News October 25, 2025

డీసీపీపై దాడికి యత్నం.. కాల్పులు

image

TG: హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్‌లో కాల్పుల కలకలం రేగింది. విక్టోరియా గ్రౌండ్‌లో సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యపై సెల్‌ఫోన్ దొంగ కత్తితో దాడి చేసేందుకు యత్నించాడు. దీంతో డీసీపీ అతడిపై మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. దొంగ తీవ్రంగా గాయపడగా నాంపల్లి ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.