News August 8, 2024
ఒలింపిక్స్: రెజ్లర్ అంతిమ్ అక్రిడేషన్‌ను రద్దు చేసిన IOA
భారత రెజ్లర్ అంతిమ్ పంఘల్ పారిస్ ఒలింపిక్స్ అక్రిడేషన్‌ను ఇండియన్ ఒలింపిక్ అసోషియేషన్(IOA) రద్దు చేసింది. అంతిమ్ అక్రిడేషన్ కార్డుతో ఆమె సోదరి నిశా ఒలింపిక్ విలేజీలోకి ప్రవేశించడమే దీనికి కారణం. అక్రమంగా ప్రవేశించిన నిశాను అదుపులోకి తీసుకున్న పోలీసులు కాసేపటికే విడుదల చేశారు. పోలీసుల ఫిర్యాదుతో క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డారని అంతిమ్‌ను టీమ్‌తో సహా భారత్ పంపనున్నట్లు IOA పేర్కొంది.
Similar News
News January 16, 2025
గిరిజన రైతులకు గుడ్ న్యూస్
TG: ‘ఇందిరమ్మ జలప్రభ స్కీమ్’లో భాగంగా గిరిజన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం 100% సబ్సిడీతో సోలార్ పంపుసెట్లు ఇవ్వనుంది. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద 4 ఎకరాల్లోపు భూములు సాగు చేస్తున్న 2.30లక్షల మందికి బోరు వేసేందుకు, మోటార్‌కు అయ్యే ఖర్చును అందించనుంది. ఒక్కో రైతు యూనిట్ కాస్ట్ ₹6Lగా నిర్ణయించింది. ఈ స్కీమ్ దశల వారీగా అమలు కానుండగా బడ్జెట్లో నిధులు కేటాయించనుంది. కేంద్రం నుంచి 40% నిధులు రానున్నాయి.
News January 16, 2025
BREAKING: సైఫ్ అలీఖాన్‌పై దాడి
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగింది. ముంబైలోని సైఫ్ నివాసంలోకి అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తి ఆయన పనిమనిషితో వాగ్వాదానికి దిగాడు. సైఫ్ జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించగా దుండగుడు కత్తితో అటాక్ చేసి, పరారయ్యాడు. దీంతో ఈ నటుడికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సర్జరీ చేయాల్సి ఉందని వైద్యులు తెలిపారు.
News January 16, 2025
Stock Markets: భారీ గ్యాప్‌అప్ ఓపెనింగ్‌కు ఛాన్స్!
స్టాక్‌మార్కెట్లు నేడు భారీ లాభాల్లో మొదలవ్వొచ్చు. ఆసియా, గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తుండటమే ఇందుకు కారణం. గిఫ్ట్‌నిఫ్టీ ఏకంగా 146 పాయింట్ల లాభంతో చలిస్తుండటం గమనార్హం. ఆసియా సూచీలన్నీ గ్రీన్‌లో కళకళలాడుతున్నాయి. నిన్న US, EU స్టాక్స్ అదరగొట్టాయి. US ఇన్ఫ్లేషన్ తగ్గిందన్న వార్తలు పాజిటివ్ సెంటిమెంటు నింపుతున్నాయి. డాలర్, ట్రెజరీ, బాండ్ యీల్డుల విలువలు కాస్త కూల్ఆఫ్ అయ్యాయి.