News August 1, 2024
OLYMPICS: ప్రణయ్‌పై లక్ష్యసేన్ విజయం

పారిస్ ఒలింపిక్స్ ప్రీక్వార్టర్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్‌తో జరిగిన పోరులో లక్ష్యసేన్ విజయం సాధించారు. తొలి సెట్లో 21-12, రెండో సెట్లో 21-6 తేడాతో ప్రణయ్‌ను ఓడించి క్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. <<-se>>#Olympics2024<<>>
Similar News
News February 11, 2026
కోడి గుడ్డు ధరలు తగ్గాయ్

తెలుగు రాష్ట్రాల్లో కోడి గుడ్ల ధరలు తగ్గాయి. డిసెంబర్ నెలాఖరున, జనవరిలో రిటైల్ మార్కెట్లో ఒక గుడ్డు రూ.8 పలకగా ఇప్పుడు రూ.6కు దిగివచ్చింది. హోల్ సేల్‌గా డజన్, ట్రే కొనుగోలు చేస్తే రూ.5కే విక్రయిస్తున్నారు. గుడ్ల ఉత్పత్తి పెరగడం, దాణా ధరలు తగ్గడంతో ఎగ్స్ రేట్లు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు.
News February 11, 2026
నవజాత శిశువుల్ని ఇలా రక్షిద్దాం..

నవజాత శిశువుల్లో 80 శాతం మంది నెలలు వివిధ కారణాల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని యునిసెఫ్ నివేదిక తెలిపింది. వీటిని నివారించడానికి న్యూ బోర్న్ స్క్రీనింగ్ ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. పుట్టిన 48-96 గంటల మధ్య ఈ పరీక్ష చేస్తారు. శిశువు మడమ నుండి రక్త నమూనాలను సేకరించి పరీక్షిస్తారు. దీనివల్ల వ్యాధులను ముందుగా గుర్తించడం వల్ల శారీరక, మానసిక వైకల్యాలతో సహా ప్రాణాంతక వ్యాధులను నివారించవచ్చు.
News February 11, 2026
టారిఫ్‌లే అస్త్రంగా భారత్-పాక్ యుద్ధాన్ని ఆపేశా: ట్రంప్

భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని ట్రంప్ మరోసారి అన్నారు. ఇరుదేశాలు దాదాపు అణు యుద్ధం దిశగా సాగాయని చెప్పుకొచ్చారు. టారిఫ్‌లను అస్త్రంగా వాడి ఘర్షణల్ని నివారించినట్లు చెప్పారు. తన మధ్యవర్తిత్వం వల్ల దాదాపు కోటి మందికి చావు తప్పిందని స్వయంగా పాక్ ప్రధాని చెప్పినట్లు తెలిపారు. ఇరు దేశాల ఘర్షణల్లో దాదాపు 10 విమానాలు కుప్పకూలినట్లు చెప్పారు. మనుషులు చనిపోవడం ఇష్టంలేకే యుద్ధాల్ని ఆపానన్నారు.


