News July 29, 2024

Olympics: త్రుటిలో చేజారిన పతకం

image

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ త్రుటిలో పతకాన్ని చేజార్చుకుంది. పురుషుల 10M ఎయిర్ రైఫిల్ ఫైనల్లో అర్జున్ బబుతా నిరాశపరిచారు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో అర్జున్ 208.4 పాయింట్లతో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నారు. #Olympics2024

Similar News

News March 30, 2026

SSY, PPF వడ్డీ రేట్లు ఇవే..

image

స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై వడ్డీ రేట్లను కేంద్రం వరుసగా ఎనిమిదోసారీ మార్చలేదు. FY27లో APR 1 నుంచి JUNE 30 వరకు పాత రేట్లే కొనసాగుతాయి. సుకన్య సమృద్ధి యోజన(SSY) డిపాజిట్లకు 8.2%, మూడేళ్ల కాల పరిమితి సేవింగ్స్‌కు 7.1% వడ్డీ లభిస్తుంది. PPFకు 7.1%, పోస్టాఫీస్ డిపాజిట్లకు 4%, కిసాన్ వికాస్ పత్రకు 7.5%(115 నెలలు), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌కు 7.7%, మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌కు 7.4% వడ్డీ ఉంటుంది.

News March 30, 2026

IPL: ధోనీ లేకపోతే చెన్నైకి ఓటమి తప్పదా?

image

MS ధోనీ లేకుండా ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచుల్లో CSK ఒక్క దాంట్లో మాత్రమే గెలిచింది. 2010లో ఢిల్లీపై ఈ విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత 2010లో పంజాబ్, బెంగళూరు, 2019లో SRH, ముంబైతో ఓటమిపాలైంది. ఈరోజు RRతో మ్యాచ్‌లోనూ ధోనీ లేకుండానే బరిలోకి దిగింది. మరి ఈ మ్యాచులో సూపర్ కింగ్స్ గెలుస్తుందా? కామెంట్ చేయండి.

News March 30, 2026

పాకిస్థాన్‌కు షాకిచ్చిన ఇరాన్

image

అమెరికా-ఇరాన్‌ మధ్య శాంతి చర్చలపై మధ్యవర్తిత్వానికి పాకులాడుతున్న పాకిస్థాన్‌కు షాక్ తగిలింది. ఆ దేశ నేతల ప్రకటనలను ఇరాన్ ఖండించింది. పాక్ వేదికలపై చర్చల్లో తాము పాల్గొనలేదని ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ Xలో స్పష్టం చేసింది. ‘అమెరికాతో ప్రత్యక్ష చర్చల్లేవు. వారు మధ్యవర్తుల ద్వారా అసమంజసమైన డిమాండ్లు చేస్తున్నారు. US దౌత్య విధానాలు నిత్యం మారుతున్నాయి’ అని పేర్కొంది.