News August 12, 2024
OLYMPICS: మరోసారి అమెరికాకే అందలం

ఒలింపిక్స్లో అగ్రరాజ్యం అమెరికా మరోసారి టాప్ ర్యాంకుతో తన ప్రయాణం ముగించింది. పారిస్ విశ్వ క్రీడల్లో ఆఖరి మెడల్ ఆ దేశానిదే కావడంతో చైనాతో సమానంగా నిలిచింది. ఇరు దేశాలు చెరో 40 స్వర్ణ పతకాలు నెగ్గాయి. ఓవరాల్గా యూఎస్ 126 పతకాలు సాధించి అగ్రస్థానం దక్కించుకుంది. ఆ తర్వాత చైనా (91), జపాన్ (45), ఆస్ట్రేలియా (53), ఫ్రాన్స్ (64), నెదర్లాండ్స్ (34) ఉన్నాయి. కాగా భారత్ 6 పతకాలతో 71వ స్థానంలో నిలిచింది.
Similar News
News December 13, 2025
తూ.గో: కాంగ్రెస్ పార్టీకి బిల్డర్ బాబి రాజీనామా!

వ్యక్తిగత కారణాలతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్డర్ బాబీ శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశానని లేఖలో పేర్కొన్నారు. ఈమేరకు తన రాజీనామా లేఖను పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిలకు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కరాజు రామారావుకు పంపినట్లు తెలిపారు.
News December 13, 2025
ప్రసార భారతిలో కాస్ట్ ట్రైనీ పోస్టులు

<
News December 13, 2025
₹21000 CRతో యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణం: పొంగులేటి

TG: కుల, మతాలకు అతీతంగా విద్యార్థులందరికీ ఉత్తమ విద్య అందించేలా యంగ్ ఇండియా స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ‘CM విద్యకు ప్రాధాన్యమిస్తున్నారు. ₹21వేల కోట్లతో ఈ స్కూళ్ల భవనాలు నిర్మిస్తున్నాం. అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా ₹642 కోట్లతో స్కూళ్లలో సదుపాయాలు కల్పిస్తున్నాం’ అని వివరించారు. నైపుణ్యాల పెంపునకు ITIలలో ATCలను నెలకొల్పుతున్నట్లు వివరించారు.


