News August 9, 2024

OLYMPICS: అందంగా ఉందని ఇంటికి పంపారు!

image

పారిస్ ఒలింపిక్స్‌లో పరాగ్వే స్విమ్మర్ లువానా అలోన్సోకు చేదు అనుభవం ఎదురైంది. అందంగా ఉండి తోటి క్రీడాకారులను ఇబ్బందులకు గురి చేసిందంటూ ఆమెను పరాగ్వే బృందం స్వదేశం పంపింది. స్విమ్ సూట్‌లతో కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ తన సొంత టీమ్‌కు చిరాకు తెప్పిస్తోందని, తమ క్రీడాకారుల ఏకాగ్రతను దెబ్బ తీస్తోందని భావించి ఈ చర్యలు తీసుకుంది. కాగా ఇంటికెళ్లిన మరుసటి రోజే ఆమె స్విమ్మింగ్‌కు గుడ్ బై చెప్పారు.

Similar News

News January 15, 2026

జెమినీలో ‘పర్సనల్ ఇంటెలిజెన్స్’ ఫీచర్.. ఏంటిది?

image

యూజర్ల వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా సమాధానాలు అందించేలా జెమినీ యాప్‌లో ‘పర్సనల్ ఇంటెలిజెన్స్’ ఫీచర్‌ను తీసుకొచ్చినట్లు గూగుల్ CEO సుందర్ పిచాయ్ వెల్లడించారు. దీంతో జెమినీ యాప్‌ను జీమెయిల్, గూగుల్ ఫొటోస్ వంటి యాప్స్‌తో సింక్ చేయొచ్చు. తద్వారా మన పాత ఈమెయిల్స్‌, ఫొటోలకు సంబంధించిన వివరాలను వెతకడం లేదా ప్లాన్‌లను రూపొందించడం వంటి పనులను మరింత కచ్చితంగా చేయొచ్చు. ఈ ఫీచర్ డిఫాల్ట్‌గా ఆఫ్‌లో ఉంటుంది.

News January 15, 2026

‘జన నాయగన్’ విషయంలో జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరణ

image

విజయ్ దళపతి నటించిన ‘జన నాయగన్’ సినిమా విడుదల విషయంలో జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ నెల 20న విచారణ జరిపి తగిన నిర్ణయం తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్‌కు సూచించింది. గతంలో U/A సర్టిఫికెట్ ఇవ్వాలన్న సింగిల్ బెంచ్ ఆదేశాలపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. అయితే, CBFC సర్టిఫికెట్ క్లియరెన్స్ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని నిర్మాతలు SCని ఆశ్రయించారు.

News January 15, 2026

మనీ ప్లాంట్ త్వరగా పెరగాలంటే?

image

* మనీ ప్లాంట్ పెంచే నీళ్లలో కొద్దిగా శీతల పానీయాలు పోస్తే ప్లాంట్ త్వరగా పెరుగుతుంది. * వంటింట్లో నాలుగు మూలలు బోరిక్ యాసిడ్ పౌడర్‌ చల్లితే దోమల బెడద తగ్గుతుంది. * కళ్లజోడు అద్దాలకు టూత్ పేస్ట్ రాసి టిష్యూ పేపర్‌తో శుభ్రం చేస్తే జిడ్డు పోతుంది. * అన్నం విడివిడిగా రావాలంటే ఉడికేటప్పుడు టేబుల్ స్పూన్ కనోలా ఆయిల్ వేయాలి. * చపాతీలను బియ్యప్పిండితో వత్తితే మృదువుగా వస్తాయి.