News July 29, 2024
Olympics: క్రికెట్లో వందేళ్ల క్రితం ఫ్రాన్స్‌కు సిల్వర్

కొన్నేళ్లుగా ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చాలని డిమాండ్ వినిపిస్తోంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే వందేళ్ల క్రితం 1900 పారిస్ ఒలింపిక్స్‌లో ఇంగ్లండ్, ఫ్రాన్స్ మధ్య ఏకైక క్రికెట్ మ్యాచ్ జరిగింది. అందులో గెలిచిన ఇంగ్లండ్ గోల్డ్, ఓడిన ఫ్రాన్స్ సిల్వర్ మెడల్ పొందాయి. అయితే తమ దగ్గర క్రికెట్‌కు ఆదరణ లేకపోవడంతో ఫ్రాన్స్ పతకం సాధించిన విషయం ఆ దేశస్థులకే సరిగ్గా తెలియదట. <<-se>>#OLYMPICS2024<<>>
Similar News
News February 1, 2026
పాక్‌లో దాడులు.. 125 మంది మృతి

పాక్ అధీనంలోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో BLA రెబల్స్, ఆర్మీ మధ్య జరిగిన <<19013238>>దాడుల్లో<<>> 125 మంది చనిపోయారు. 12 ప్రాంతాల్లో BLA దాడులు చేసిందని, అందులో 18 మంది సెక్యూరిటీ సిబ్బంది, 15 మంది పౌరులు చనిపోగా పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. మరోవైపు 92 మంది మిలిటెంట్లు చనిపోయినట్లు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భద్రతా వర్గాలు చెప్పాయి. అక్కడ పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాలేదని సమాచారం.
News February 1, 2026
ప్రకృతి సేద్యంలో చీడపీడల కట్టడి ఎలా?

పర్యావరణానికి, ఆరోగ్యానికి మేలు చేసే ప్రకృతి సేద్యం చేస్తున్న రైతుల సంఖ్య పెరుగుతోంది. అయితే ఈ విధానంలో కూడా చీడపీడల సమస్య ఉంటుంది. రసం పీల్చే పురుగులు, ఆకుముడత, కాండం, కాయతొలిచే పురుగులు, వేరు పురుగుల ఉద్ధృతి కనిపిస్తోంది. వీటిని బ్రహ్మాస్త్రం, అగ్నాస్త్రం, నీమాస్త్రాలతో కట్టడి చేయవచ్చు. ఈ సహజ పురుగు మందుల తయారీ విధానం, ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.
News February 1, 2026
మానసిక ఆరోగ్యం కోసం ఇవి తినాల్సిందే..

సరైన పోషకాహారం లేకపోవడం వల్ల ఒత్తిడి, నిద్రలేమి, మానసిక సమస్యలు పెరుగుతున్నట్లు అధ్యయనంలో తేలింది. వేపుళ్లు, తీపి పదార్ధాలు, మాంసం ఉత్పత్తులు ఎక్కువగా తీసుకుంటే వాటి వల్ల ఇన్ఫ్లమేష్ పెరిగి మానసిక ఒత్తిడికి దారితీస్తోందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇలా కాకుండా ఉండాలంటే ఆహారంలో ఐరన్, జింక్, ఆమ్లాలు ఉండేలా చూసుకోవాలి. పాలు, పెరుగు, చీజ్, ఆమ్లా, అవకాడో, ఆలివ్ నూనె డైట్లో చేర్చుకోవాలి.


