News August 4, 2024
ఒలింపిక్స్: THE WALL OF INDIA!.. అదరగొట్టిన శ్రీజేశ్

హాకీలో ప్రపంచ నం-2 బ్రిటన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ అదరగొట్టింది. గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్ మన జట్టుకు వెన్నెముకగా నిలిచారు. రెడ్ కార్డు వల్ల డిఫెండర్ అమిత్ రోహిదాస్ దూరం కావడంతో మన జట్టు 10 మందితోనే ఆడింది. బ్రిటన్ కంటిన్యూగా అటాక్ చేసినా శ్రీజేశ్ పట్టువదలని విక్రమార్కుడిలా డిఫెండ్ చేశారు. షూటౌట్‌లోనూ అడ్డుగోడగా నిలిచారు. అతడిని ‘THE WALL OF INDIA!’ అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Similar News
News March 7, 2026
పెరిగిన ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కాలేజీ ఫీజులు

TG: ప్రైవేటు ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కళాశాలల్లో కొత్త ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. 2025-28 విద్యాసంవత్సరానికి బీఫార్మసీకి గరిష్ఠంగా రూ.1.21 లక్షలు, ఫార్మాడీకి రూ.1.37లక్షలుగా నిర్ధారించింది. గతంతో పోలిస్తే 10-15% పెరిగింది. కనిష్ఠ ఫీజును రూ.45వేలకు పరిమితం చేసింది. అయితే మెజార్టీ కాలేజీల్లో ఫీజులు రూ.50-80వేల మధ్య ఉన్నాయి. ఇక ఆర్కిటెక్చర్ ఫీజును గరిష్ఠంగా ₹1.32లక్షలుగా సర్కార్ నిర్ణయించింది.
News March 7, 2026
టీమ్ ఇండియాపైనే ఒత్తిడి: షోయబ్ అక్తర్

T20 WC ఫైనల్‌లో టీమ్ ఇండియాపైనే ఒత్తిడి ఉందని పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ చెప్పారు. ‘అహ్మదాబాద్‌లో 175-200 స్కోరు నమోదు కావచ్చు. ఒకవేళ న్యూజిలాండ్ 225-250 కొడితే భారత్‌పై ప్రెజర్ పడుతుంది. ఎందుకంటే 150 కోట్ల మంది చూస్తుంటారు. పైగా ఇదే గ్రౌండ్‌లో 2023 ODI WC ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఇండియా ఓడింది’ అని అన్నారు. IND టైటిల్ ఫేవరేట్ అని, అయితే NZ గెలవడం కూడా క్రికెట్‌కు మంచిదని అభిప్రాయపడ్డారు.
News March 7, 2026
కర్ణాటక HCలో శ్రీలంక SC జడ్జి పిటిషన్.. ఎందుకంటే?

ఆన్‌లైన్ కంటెంట్ కారణంగా తన పరువుకు భంగం కలుగుతోందని శ్రీలంక SC జడ్జి జస్టిస్ నవాజ్ కర్ణాటక HCలో పిటిషన్ వేశారు. వాటి ఆధారంగా SL మీడియా వ్యతిరేకంగా కథనాలు ప్రచురిస్తోందని, ఆ కంటెంట్ తొలగించేలా ఆదేశాలివ్వాలని కోరారు. కేంద్రం, గూగుల్ INDను ప్రతివాదులుగా చేర్చారు. శ్రీలంక SC జడ్జి తమ దేశంలో పరువునష్టం దావా వేయడం అక్కడి నిబంధనలకు విరుద్ధం. గూగుల్ IND HQ బెంగళూరులో ఉండటంతో పిటిషన్ వేశారు.


