News August 4, 2024
OLYMPICS: అప్పుడు విడిపోయారు.. ఇప్పుడు కలిశారు!

పారిస్ ఒలింపిక్స్‌లో ఆసక్తికర ఘటన జరిగింది. చెక్ రిపబ్లిక్‌కు చెందిన టెన్నిస్ స్టార్లు టొమాస్ మచాక్, కేటరీనా సినియకోవా ఒలింపిక్స్‌కు ముందు బ్రేకప్ చెప్పుకున్నారు. తాజాగా వారిద్దరూ కలిసి దేశం కోసం మిక్స్‌డ్ డబుల్స్‌లో ఆడి స్వర్ణ పతకం సాధించారు. ఈ క్రమంలో ఇద్దరూ కోర్టులోనే కౌగిలించుకుని ముద్దులు పెట్టుకున్నారు. దీంతో విడిపోయిన ప్రేమపక్షులు మళ్లీ కలిశాయని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Similar News
News March 10, 2026
ప్రెగ్నెన్సీ ఫస్ట్ ట్రైమిస్టర్‌లో ఈ జాగ్రత్తలు తీసుకోండి

ఆరు నుంచి 12 వారాల్లో బిడ్డ అవయవాలన్నీ ఏర్పడుతాయి. ఈ సమయంలో వైద్యుల సలహా లేకుండా ఎలాంటి మందులు వాడకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్స్‌రేలకు దూరంగా ఉండాలి. ఏ సమస్య అనిపించినా వైద్యులను సంప్రదించాలి. జ్వరం వస్తే వెంటనే చికిత్స చేయించుకోవాలి. జన్యుపరమైన సమస్యలుంటే తప్ప అబార్షన్ కాదు. అన్ని పనులు చేసుకోవచ్చు. బరువులు ఎత్తడం, పరిగెత్తడం మానేయాలని సూచిస్తున్నారు.
News March 10, 2026
భారత్ నుంచి బంగ్లాకు 5,000 టన్నుల డీజిల్?

ఇండియా నుంచి తమకు పైప్‌లైన్ ద్వారా 5,000 టన్నుల డీజిల్ రానుందని బంగ్లాదేశ్ పెట్రోలియం కార్పొరేషన్ ఛైర్మన్ రెజనూర్ రెహ్మాన్ తెలిపారు. ఏటా 1,80,000 టన్నుల డీజిల్ సరఫరా కోసం భారత్‌తో ఒప్పందం ఉందని.. తాజా దిగుమతి అందులో భాగమేనన్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు సరఫరాపై ఆందోళనలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో బంగ్లా ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది. దీనిపై భారత్ స్పందించాల్సి ఉంది.
News March 10, 2026
నన్ను తిట్టి, కొట్టేవాడు.. మాజీ క్రికెటర్‌పై కోర్టుకెక్కిన భార్య

IND మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రాపై అతని భార్య గరిమా కాన్పూర్(UP) కోర్టును ఆశ్రయించారు. అమిత్, అతని ఫ్యామిలీ అదనపు కట్నం కోసం శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారని పేర్కొన్నారు. అమిత్ తాగొచ్చి తిట్టి, కొట్టేవాడని, ఫుడ్ పెట్టకుండా వేధించేవాడని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఈ పిటిషన్‌పై కోర్టు త్వరలో విచారణ చేపట్టనుంది. షమీ కూడా గృహ హింస కేసు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.


