News July 25, 2024
ఒలింపిక్స్: బరిలో ఉన్న తెలుగమ్మాయిలు వీరే!

ఈసారి ఒలింపిక్స్‌లో భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు బరిలో నిలిచారు. అందులో 40 మందికి పైగా మహిళా అథ్లెట్లు ఉన్నారు. ఇందులో ఐదుగురు తెలుగమ్మాయిలు.
1. బ్యాడ్మింటన్: పీవీ సింధు
2. బాక్సింగ్: నిఖత్ జరీన్
3. 100 మీ. హార్డిల్స్ రేస్: జ్యోతి యర్రాజీ
4. టేబుల్ టెన్నిస్: శ్రీజ ఆకుల
5. 4×400M రిలే ఈవెంట్: జ్యోతిక శ్రీ
<<-se>>#Olympics2024<<>>
Similar News
News March 27, 2026
పెమ్మసాని.. బ్యాలెట్‌తో తంతే USలో పడతావ్: అంబటి

AP: వైఎస్ జగన్‌కు వార్నింగ్ ఇచ్చిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌పై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైరయ్యారు. ‘మాటతోనే చంపే రౌడీవా పెమ్మసాని.. వచ్చే ఎన్నికల్లో బ్యాలెట్‌తో తంతే అమెరికాలో పడతావ్ జాగ్రత్త’ అని ట్వీట్ చేశారు. ‘చంద్రబాబు సుందర ముఖారవిందాన్ని చూసి మిట్టల్ స్టీల్ ప్లాంట్ వచ్చినట్లు బిల్డప్ ఇస్తున్నారు’ అని ఇటీవల జగన్ విమర్శించడంతో ‘ఒక్క మాటతో చంపేయగలం’ అంటూ పెమ్మసాని హెచ్చరించారు.
News March 27, 2026
165 ఏళ్ల రికార్డును బ్రేక్ చేయనున్న ట్రంప్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చరిత్ర సృష్టించనున్నారు. US 250వ స్వాతంత్య్ర దినోత్సవం(4-7-2026) సందర్భంగా కొత్తగా ముద్రించే డాలర్ నోట్లపై ఆయన సైన్ చేయనున్నారు. 1861 నుంచి కరెన్సీ నోట్లపై ట్రెజరర్ సంతకమే ఉంటుండగా ఆ సంప్రదాయాన్ని బ్రేక్ చేయనున్న తొలి ప్రెసిడెంట్‌గా ట్రంప్ నిలుస్తారు. 250వ ఇండిపెండెన్స్ డేకు గుర్తుగా ఇటీవల ట్రంప్ చిత్రంతో 24 క్యారెట్ల గోల్డ్ కాయిన్ నమూనాను ఆవిష్కరించిన విషయం తెలిసిందే.
News March 27, 2026
సీతారాముల కళ్యాణంలో తలంబ్రాల విశిష్టత

భద్రాచలంలో సీతారాముల కళ్యాణంలో ముత్యాలు కలిపిన, గోటితో ఒలిచిన తలంబ్రాలను వధూవరులైన సీతారాములపై పోస్తారు. ఈ తలంబ్రాల తయారీలో ఉపయోగించే వరి ధాన్యాన్ని భక్తులు నియమనిష్టలతో పండించి నూర్పిడి చేసి వడ్లుగా మారుస్తారు. వీటిని గోటితో ఒలిచి బియ్యంగా మార్చి భద్రాచలానికి కాలినడకన వచ్చి అందిస్తారు. వీటికి బుక్కా, గులాలు, అత్తరు, పన్నీరు, ఆవునెయ్యిని కలుపుతారు. అందుకే ఈ కల్యాణ తలంబ్రాలు గులాబీ రంగులో ఉంటాయి.


