News July 25, 2024

OLYMPICS: యుస్రా మర్దిని జర్నీ ప్రత్యేకం!

image

సిరియాకు చెందిన స్విమ్మర్ యుస్రా మర్దిని బాంబు దాడిలో సర్వస్వం కోల్పోయారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పడవలో టర్కీ మీదుగా గ్రీసుకు వచ్చారు. అక్కడి నుంచి బస్సు, రైళ్లు, నడక ద్వారా జర్మనీకి చేరుకుని, శరణార్థుల శిబిరంలో తలదాచుకున్నారు. ఆ సమయంలో శరణార్థుల కోసం IOC ఏర్పాటు చేసిన ప్రత్యేక జట్టుకు ఎంపికయ్యారు. అలా రియో, టోక్యో ఒలింపిక్స్‌ల్లో మెరిశారు. పారిస్ ఒలింపిక్స్‌లోనూ పాల్గొనేందుకు సిద్ధమయ్యారు.

Similar News

News December 6, 2025

కూరగాయ పంటల్లో వైరస్ తెగుళ్ల లక్షణాలు (2/2)

image

వైరస్ ఆశించిన కొన్ని కూరగాయల మొక్కల ఆకులు ముడతలు పడి, ముడుచుకొని, నిక్కబొడుచుకొని కనిపిస్తాయి. ఆకులు చిన్నగా ఉండి ఆకుపచ్చ రంగు కోల్పోవడం వల్ల మొక్కల్లో ఆహారోత్పత్తి తగ్గి వాడిపోయినట్లుగా ఉంటాయి. వైరస్ ఆశించిన మొక్కల్లో లేత ఆకులు చిన్నగా మారి, పైకి కిందికి ముడుచుకొని వికారంగా మారతాయి. మొక్కల్లో పెరుగుదల లోపించి, కణుపుల మధ్యదూరం తగ్గి గిడసబారి పూత రావడం, కాయకట్టడం తగ్గుతుంది.

News December 6, 2025

స్ఫూర్తిని రగిలించే డా.అంబేడ్కర్ మాటలు

image

➛ ఎంత ఎక్కువ కాలం బతికామన్నది కాదు. ఎంత గొప్పగా జీవించామన్నదే ముఖ్యం
➛ మేకల్ని బలి ఇస్తారు. పులుల్ని కాదు. పులుల్లా బతకండి
➛ మాట్లాడాల్సిన చోట మౌనంగా ఉండటం, మౌనంగా ఉండాల్సిన చోట మాట్లాడటం రెండూ తప్పే
➛ ప్రజలకు ఓటు హక్కే ఆయుధం. పోరాడి రాజులవుతారో అమ్ముకుని బానిసలవుతారో వారి చేతుల్లోనే ఉంది
➛ విశ్వాసం కలిగి ఉండండి. ఆశను కోల్పోకండి
* ఇవాళ అంబేడ్కర్ వర్ధంతి *

News December 6, 2025

చిన్న చీమ పెద్ద మనసు.. చావడానికీ వెనుకాడదు!

image

కష్టం, క్రమశిక్షణకు మారుపేరైన చీమల గురించి ఓ ఆసక్తికర విషయం వెల్లడైంది. తీవ్రంగా జబ్బుపడిన చీమలు తమ జాతిని కాపాడుకోవడానికి ప్రాణత్యాగానికి సిద్ధమవుతాయని ఆస్ట్రియా పరిశోధకుల స్టడీలో తేలింది. అనారోగ్యానికి గురైనవి రసాయన వాయువు రిలీజ్ చేసి ‘డేంజర్’, ‘నన్ను చంపండి’ అనే సిగ్నల్‌ ఇస్తాయని సైంటిస్టులు చెప్పారు. దీంతో ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా ఆ చీమ గూడును ఇతర చీమలు చీల్చివేస్తాయని తెలిపారు.