News October 24, 2024

ప్రధాని మోదీని కలిసిన ఒమర్ అబ్దుల్లా

image

జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రధాని మోదీతో ఢిల్లీలో భేటీ అయ్యారు. J&Kకు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని J&K క్యాబినెట్ చేసిన తీర్మాన పత్రాన్ని ప్రధానికి అందజేశారు. అంతకుముందు అబ్దుల్లా.. కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, రాజ్‌నాథ్ సింగ్‌లను కలిశారు. J&Kలో రహదారుల అనుసంధానాన్ని పెంచాలని కోరారు.

Similar News

News September 14, 2025

ఆ అమ్మవారికి పెరుగన్నమే ప్రీతి

image

నిర్మల్ జిల్లాలోని అడెల్లి పోచమ్మకు పెరుగన్నమంటే చాలా ప్రీతి. ఒకప్పుడు తీవ్రమైన కరవుతో అల్లాడిన ప్రజలను రక్షించడానికి శివుడు తన కుమార్తె పోచమ్మను ఇక్కడికి పంపాడని నమ్ముతారు. ఆమె కృప వల్లే ఇక్కడ వర్షాలు కురిసి, కరవు పోయిందని అంటారు. అందుకే అమ్మవారికి కోనేటి నీటితో వండిన అన్నంలో పెరుగు కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఆలయం వద్దే వంటలు చేసుకొని పంక్తి భోజనాలు చేస్తారు.

News September 14, 2025

SBIలో 122 పోస్టులు

image

<>ఎస్బీఐ<<>> 122 పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్‌లు విడుదల చేసింది. ఇందులో మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టులు 59, మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్) 63 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు OCT 2వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.750, SC, ST, దివ్యాంగులకు ఫీజు లేదు. షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://sbi.bank.in/

News September 14, 2025

కేజీ చికెన్ ధర రూ.280.. ఎక్కడంటే?

image

తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల చికెన్ ధరలు గత వారంతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. TGలోని హైదరాబాద్‌, కామారెడ్డి, ఖమ్మంతో పాటు APలోని విజయవాడ, గుంటూరు, నంద్యాల, పల్నాడు, తూ.గో తదితర నగరాల్లో స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.230-240కి విక్రయిస్తున్నారు. అత్యధికంగా తిరుపతిలో రూ.280, అత్యల్పంగా కాకినాడలో రూ.220-230గా ఉంది. మీ ఏరియాలో రేట్ ఎంత? COMMENT