News April 8, 2024
గొడ్డు మాంసంపై అప్పుడలా.. ఇప్పుడిలా..

బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్‌పై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఆమె బీఫ్(గొడ్డు మాంసం)పై చేసిన రెండు రకాల ట్వీట్లే దీనికి కారణం. తాజాగా తాను గొడ్డు మాంసం తిననని ట్వీట్ చేసిన కంగన.. 2019 మే 19న ఇందుకు భిన్నంగా గొడ్డు మాంసం తినడం తప్పుకాదని, దానికి మతంతో సంబంధం లేదని ట్వీట్ చేశారు. దీంతో ఈ రెండు ట్వీట్లను పోల్చుతూ నెటిజన్లు ఆమెపై సెటైర్లు వేస్తున్నారు.
Similar News
News April 6, 2026
ఏప్రిల్ 6: చరిత్రలో ఈరోజు

1886: HYD చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ జననం
1896: ఏథెన్స్‌లో ఆధునిక ఒలింపిక్ క్రీడలు ప్రారంభం
1928: DNA నిర్మాణాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్త జేమ్స్ వాట్సన్ జననం
1938: కీటక శాస్త్రవేత్త, పద్మశ్రీ&పద్మభూషణ్ అవార్డుల గ్రహీత వినోద్ ప్రకాశ్ శర్మ జననం
1956: భారత మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్ జననం
2011: సినీ నటి సుజాత మరణం (ఫొటోలో)
News April 6, 2026
PHOTO GALLERY: చెన్నైvsRCB మ్యాచ్

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన CSKvsRCB మ్యాచుకు ప్రేక్షకులు భారీగా తరలివచ్చారు. విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ, RCB ఓనర్ అనన్య బిర్లా, మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వంటి ప్రముఖులు సైతం మ్యాచును ఎంజాయ్ చేశారు. 2024 సీజన్ నుంచి చెన్నైపై RCBకి ఇది వరుసగా నాలుగో విజయం. ఈ మ్యాచ్ ఓడటానికి తానే కారణమని, బ్యాటింగ్‌లో తాను మంచి స్కోర్ చేయాల్సిందని CSK కెప్టెన్ రుతురాజ్ అన్నారు.
News April 6, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.


