News August 21, 2024

ఓవైపు హైడ్రా.. మరోవైపు ఫుడ్ సేఫ్టీ

image

TG: HYDలో హైడ్రా, ఫుడ్ సేఫ్టీ పేర్లు మార్మోగుతున్నాయి. నగరంలోని చెరువులు, కాలువలను ఆక్రమించి నిర్మించిన భవనాలను హైడ్రా కూల్చేస్తోంది. అటు ఫుడ్ సేఫ్టీ విభాగం సైతం గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద పెద్ద రెస్టారెంట్లలోనూ తనిఖీలు చేస్తూ, వాటి బండారం బయటపెడుతోంది. దీంతో ఈ విభాగాలపై ప్రశంసలు కురుస్తున్నాయి. అన్ని ప్రభుత్వ విభాగాలు ఇలా నిజాయితీగా పని చేస్తే నగరం మరింత బాగుపడుతుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.

Similar News

News November 24, 2025

జపాన్ రెడ్ లైన్ క్రాస్ చేసింది: చైనా

image

తైవాన్‌పై చైనా కవ్వింపు చర్యలకు పాల్పడితే సైనిక జోక్యానికి జపాన్ వెనుకాడబోదని ప్రధాని సనై తకాయిచి చేసిన వ్యాఖ్యలపై డ్రాగన్ దేశం మండిపడింది. ఈ కామెంట్లతో జపాన్ రెడ్ లైన్‌ క్రాస్ చేసిందని చైనా మినిస్టర్ వాంగ్ యీ అన్నారు. జపాన్ సైనికవాదం పెరగకుండా నిరోధించాల్సిన బాధ్యత అన్ని దేశాలపై ఉందని చెప్పారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించేలా తకాయిచి కామెంట్లు ఉన్నాయంటూ UNకు రాసిన లెటర్‌లో చైనా పేర్కొంది.

News November 24, 2025

మృణాల్‌తో ధనుష్ డేటింగ్?.. పోస్టులు వైరల్

image

ధనుష్-మృణాల్ ఠాకూర్ డేటింగ్‌ చేస్తున్నారనే ప్రచారం మరోసారి ఊపందుకుంది. మృణాల్ నటించిన ‘దో దీవానే షెహర్ మే’ మూవీ టీజర్ తాజాగా విడుదలైంది. దీనిపై ఆమె ఇన్‌స్టాలో పోస్టు చేయగా ‘చాలా బాగుంది’ అనే అర్థంలో ధనుష్ కామెంట్ చేశారు. దీనికి హీరోయిన్ లవ్ సింబల్‌తో రిప్లై ఇచ్చారు. ఈ స్క్రీన్ షాట్లను అభిమానులు వైరల్ చేస్తున్నారు. వారిమధ్య బంధం నిజమేనంటున్నారు. గతంలోనూ ఇలాంటి ప్రచారం జరగగా మృణాల్ ఖండించారు.

News November 24, 2025

డిటెన్షన్ సెంటర్లకు అక్రమ వలసదారులు: యూపీ సీఎం

image

అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను యూపీ CM యోగి ఆదేశించారు. ప్రతి జిల్లాలో తాత్కాలిక డిటెన్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. విదేశీ పౌరసత్వం ఉన్న వలసదారుల వెరిఫికేషన్ పూర్తయ్యేవరకు డిటెన్షన్ సెంటర్లలో ఉంచాలని సూచించారు. వారు స్థిరపడిన విధానాన్ని బట్టి స్వదేశాలకు పంపించాలన్నారు. మరోవైపు 8ఏళ్లుగా అధికారంలో ఉండి ఇప్పుడు కావాలనే హడావిడి చేస్తున్నారని కాంగ్రెస్ నేత అజయ్ రాయ్ ఆరోపించారు.