News July 29, 2024

ఓ వైపు ఒలింపిక్స్.. మరోవైపు టెలికం లైన్ల విధ్వంసం

image

పారిస్ ఒలింపిక్స్ సవ్యంగా సాగడం డౌటే. సోమవారం ఉదయం ఫ్రాన్స్‌లో SFR, Bouygues టెలికం లైన్లను కొందరు నాశనం చేశారు. దీంతో మొబైల్, టెలీ, ఫైబర్, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగింది. కనెక్టివిటీ పరంగా ఒలింపిక్స్‌పై దీని ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి. ఓపెనింగ్ సెర్మనీకి కొన్ని గంటల ముందే 3 హైస్పీడ్ ట్రైన్ రూట్లను కొందరు టార్గెట్ చేశారు. ఇక 5 వేర్వేరు ప్రాంతాల్లో తమ టెలికం లైన్లను కట్ చేశారని SFR తెలిపింది.

Similar News

News March 30, 2026

నామినేషన్ వేసిన CM స్టాలిన్, విజయ్

image

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇవాళ కొలత్తూరు నుంచి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నామినేషన్ దాఖలు చేశారు. అటు తమిళగ వెట్రి కళగం(TVK) అధినేత, నటుడు విజయ్ దళపతి కూడా పెరంబూరు నియోజకవర్గానికి సంబంధించి చెన్నైలో నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

News March 30, 2026

చైనా సీసీటీవీలపై దేశంలో బ్యాన్?

image

ఏప్రిల్ 1 నుంచి హిక్‌విజన్, దహువా, TP-Link తదితర చైనా CCTV కెమెరాలు, పరికరాలను దేశంలో బ్యాన్ చేయనున్నట్లు తెలుస్తోంది. దేశంలో అమ్మే CCTV ప్రొడక్టులు కచ్చితంగా అనుమతి తీసుకోవాలని కేంద్రం కొత్త రూల్ తీసుకొచ్చింది. భద్రతా చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో చైనా సంస్థలు, ఆ దేశంలో తయారైన చిప్‌సెట్‌లను ఉపయోగించే పరికరాలకు పర్మిషన్ ఇచ్చేందుకు అధికారులు నిరాకరిస్తున్నట్లు సమాచారం.

News March 30, 2026

సల్మాన్- వంశీ పైడిపల్లి సినిమా.. ఏప్రిల్ నుంచి షూటింగ్!

image

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబోలో రానున్న సినిమా కన్ఫర్మ్ అయింది. ఏప్రిల్ నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని వెల్లడిస్తూ సల్మాన్, వంశీ ఉన్న ఫొటోను మేకర్స్ షేర్ చేశారు. SVC బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కాగా సల్మాన్ సరసన నటి నయనతార కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. ఈ కాంబో ఘన విజయం సాధిస్తుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేశారు.