News September 20, 2024
ఒకటో తేదీన ‘పేదల సేవలో’ కార్యక్రమం: CM

AP: ప్రతి నెల ఒకటో తేదీన ‘పేదల సేవలో’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు CM చంద్రబాబు తెలిపారు. ప్రకాశం(D) మద్దిరాలపాడులో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో మాట్లాడారు. ‘MLAలు, కలెక్టర్లు, అధికారులు పేదల ఇళ్లకు వెళ్లి వారి కష్టాలు తెలుసుకుని సాయం అందించాలి. ప్రస్తుతం ఏపీ వెంటిలేటర్పై ఉంది. 21 మంది MPలను గెలిపించడంతో ఢిల్లీలో మన పరపతి పెరిగింది. దీంతో APకి ఆక్సిజన్ తీసుకొస్తున్నాం’ అని తెలిపారు.
Similar News
News November 18, 2025
జైల్లో మొహియుద్దీన్పై దాడి!

టెర్రర్ మాడ్యూల్ కేసులో అరెస్టై అహ్మదాబాద్ సబర్మతీ జైల్లో ఉన్న డా.అహ్మద్ మొహియుద్దీన్పై దాడి జరిగింది. తోటి ఖైదీలు అతడిని చితకబాదారు. తీవ్రంగా గాయపడ్డ మొహియుద్దీన్ను పోలీసులు అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఆముదం గింజల వ్యర్థాలతో ‘రెసిన్’ అనే విషాన్ని తయారు చేసి వేలాది మందిని చంపాలని మొహియుద్దీన్ ప్రయత్నించాడు. ఈక్రమంలోనే HYD రాజేంద్రనగర్లో గుజరాత్ ATS అధికారులు అతడిని అరెస్ట్ చేశారు.
News November 18, 2025
హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం

హైడ్రా తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కూల్చివేతలపై సంధ్య కన్వెన్షన్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. ఎవరి అనుమతితో కూల్చివేశారని హైడ్రాను హైకోర్టు ప్రశ్నించింది. హైకోర్టు ఉత్తర్వులను ఎందుకు పట్టించుకోలేదని సీరియస్ అయ్యింది. ఈ కేసులో తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.
News November 18, 2025
అల్ ఫలాహ్ వర్సిటీ ఛైర్మన్ అరెస్ట్

హరియాణా ఫరిదాబాద్లోని అల్ ఫలాహ్ వర్సిటీ ఛైర్మన్ జావెద్ అహ్మద్ సిద్ధిఖీని మనీలాండరింగ్ కేసులో ED అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీ పేలుడు, టెర్రర్ మాడ్యూల్ కేసు దర్యాప్తులో భాగంగా నిన్న వర్సిటీ సహా 25 ప్రాంతాల్లో ED సోదాలు నిర్వహించి కీలక ఆధారాలు సేకరించింది. ఈక్రమంలోనే ఆయనను అదుపులోకి తీసుకుంది. కాగా వర్సిటీలో పనిచేసిన ముగ్గురు డాక్టర్లకు ఉగ్ర కుట్రతో సంబంధాలున్నాయన్న కోణంలో విచారణ జరుగుతోంది.


